విఐటీ–ఏపీలో ‘స్టార్స్‌’ 3వ బ్యాచ్‌ ప్రారంభం

10 Aug, 2019 11:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: విఐటీ ఏపీ వర్సిటీలో ‘స్టార్స్‌’ 3వ బ్యాచ్‌ శుక్రవారం ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నత చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే సంకల్పంతో తమ వర్సిటీ స్టార్స్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు విఐటీ–ఏపీ వర్సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌ విశ్వనాథన్‌ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ (ఎంపీసీ) చదివి జిల్లాలో మొదటి ర్యాంక్‌ సాధించిన విద్యార్థులకు విఐటీ–ఏపీ వర్సిటీలో నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సుతో పాటు వసతిని ఉచితంగా కల్పిస్తున్నామని వివరించారు. స్టార్స్‌ 3వ బ్యాచ్‌ కార్యక్రమాన్ని, వర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన సింథటిక్‌ టెన్నిస్‌ కోర్టుని తాటికొండ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి శుక్రవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ..విఐటీ అంటే విజన్, ఇన్నోవేషన్, ట్రాన్స్‌ఫార్మేషన్‌ అని అభివరి్ణంచారు. స్టార్స్‌ 3వ బ్యాచ్‌ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్‌ డి.శుభాకర్, రిజి్రస్టార్‌ డాక్టర్‌ సీఎల్వీ శివకుమార్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (అడ్మిషన్స్‌) డాక్టర్‌ ఖాదర్‌ పాషా తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు