విభజన పాపం రాహుల్, చంద్రబాబుదే

27 Jul, 2015 03:29 IST|Sakshi
విభజన పాపం రాహుల్, చంద్రబాబుదే

కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే నారాయణస్వామి ధ్వజం
కార్వేటినగరం :
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు చేతులు కలిపి రాష్ట్రాన్ని ముక్కలు చేసి తెలుగు ప్రజలను వీధినపడేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి అన్నారు. ఆదివారం కార్వేటినగరంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీతిమాలిన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా రాహుల్ గాంధీ, చంద్రబాబు నిలిచారన్నారు. ఉమ్మడిగా ఉన్న తెలుగు ప్రజలను విభజించి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని దుయ్యబట్టారు.

అలాంటి వారు ప్రజల కోసం పోరాడుతున్నామని ప్రగల్భాలు పలకడం దెయ్యాలువేదాలు వళ్లించినట్లుందని ఎద్దేవాచేశారు. వైఎస్ కుటుంబాన్ని విమర్శించే అర్హత రాహుల్‌కు లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఆర్.శ్రీరాములునాయుడు, సింగిల్ విండో అధ్యక్షుడు వి.లోకనాథరెడ్డి, సింగిల్ విండో డెరైక్టర్ ధనంజయవర్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దేవకీ లోకనాథరెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు