అల్తూరుపాడు ప్రాజెక్ట్‌ పనుల్లో ‘రివర్స్‌’ సక్సెస్‌

12 Dec, 2019 04:43 IST|Sakshi

రాష్ట్ర ఖజానాకు రూ.67.81 కోట్లు ఆదా 

గతంలో ఈ పనులు రూ.253.77 కోట్లకు అప్పగించిన టీడీపీ సర్కార్‌ 

ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌  

రూ.185.96 కోట్లతో 26.72 శాతం తక్కువ ధరతో ఎల్‌–1గా నిలిచిన బీవీఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌

సాక్షి, అమరావతి: సోమశిల–స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌లో అంతర్భాగమైన అల్తూరుపాడు రిజర్వాయర్‌ పనులకు బుధవారం నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో రాష్ట్ర ఖజానాకు రూ.67.81 కోట్లు ఆదా అయ్యాయి. ఈ రిజర్వాయర్‌ నిర్మాణ పనులను రూ.253.77 కోట్లకు టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే కట్టబెట్టి.. కమీషన్లు దండుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు జల వనరుల శాఖ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. అప్పట్లో ఉన్నదాన్నే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. నవంబర్‌ 11న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

బుధవారం ప్రైస్‌ బిడ్‌ను తెరవగా, 14.06 శాతం తక్కువ ధర రూ.218.09 కోట్లకు కోట్‌ చేసిన సంస్థ ఎల్‌–1గా నిలిచింది. దాంతో ప్రైస్‌ బిడ్‌ స్థాయిలోనే రూ.35.68 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదా అయ్యాయి. అనంతరం రూ.218.09 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి రివర్స్‌ టెండరింగ్‌ (ఈ–ఆక్షన్‌) నిర్వహించారు. తీవ్ర పోటీ మధ్య రూ.185.96 కోట్ల (26.72 శాతం తక్కువ ధర)కు కోట్‌ చేసిన బీవీఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఎల్‌–1గా నిలిచింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా