స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ సమావేశం

31 Mar, 2017 02:52 IST|Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ సమావేశాన్ని వివిధ బ్యాంకుల అధికారులు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు.. విజయవాడలో గురువారం నిర్వహించారు. దీనిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రంలోని కలెక్టర్లకు ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఉత్పాదకత పెంచడం వంటి అంశాలపై చర్చించారు.

2016–17 వార్షిక రుణ ప్రణాళికపై చర్చించారు. బ్యాంకర్లు రైతులకు అందిస్తున్న రుణాలు చర్చిస్తూ.. రైతులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చెల్లింపులు చేయలేకపోతున్నారన్నారు. నగదు రహిత లావాదేవీలను ముమ్మరం చేయాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఒక సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్యాంకర్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి రుణాలు అధిక మొత్తంలో అందించి వారి లక్ష్యాలను సాధించేదిశగా కృషి చేయాలన్నారు.

 ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం, ఆంధ్రాబ్యాంక్‌ జోనల్‌ మేనేజర్‌ రాధాకిషన్, ఎస్‌బీఐ రీజనల్‌ మేనేజర్‌ మేరీ సగారియా, డీఆర్‌డీఏ పీడీ జీసీ కిశోర్‌కుమార్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు జి. రామారావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ కేవీ ఆదిత్యలక్ష్మి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ జి.రాజారావు, డీసీసీబీ సీఈఓ సత్యనారాయణ, డిప్యూటీ ఎల్‌డీఎం ఎం. సత్యనారాయణ, వివిధ బ్యాంకు అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు