స్వధార్‌ హోమ్‌ బాధిత యువతులకు రాష్ట్ర మహిళా కమిషన్‌ అండ

22 May, 2020 12:12 IST|Sakshi
బాధిత యువతులను పరామర్శిస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు రాజ్యలక్ష్మి

స్వధార్‌ హోమ్‌ బాధితులకు అండగా మహిళా కమిషన్‌

రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి

బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు

తూర్పుగోదావరి, తాడితోట (రాజమహేంద్రవరం ) :  స్వధార్‌ హోమ్‌ బాధిత యువతులకు రాష్ట్ర మహిళా కమిషన్‌ అండగా ఉంటుందని కమిషన్‌ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వధార్‌ హోమ్‌ బాధితులను ఆమె పరామర్శించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లా డుతూ పరిస్థితిని మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు ఐసీడీఎస్‌ నుంచి ఒక్కొక్కరికీ రూ.25 వేలు ఆర్థ్ధిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించే విధంగా మహిళా కమిషన్‌ కృషి చేస్తుందన్నారు. బొమ్మురు మహిళా ప్రాంగణం స్వధార్‌ హోమ్‌ నుంచి తరలించిన యువతులను కందుకూరి వీరేశలింగం స్టేట్‌హోమ్‌లో ఉన్న వారిని మహిళా కమిషన్‌ సభ్యురాలు పరామర్శించారు. డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ కోమల, మహిళా ప్రాంగణం ఇన్‌చార్జ్‌ సీహెచ్‌వీ నరసమ్మ తదితరులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు