ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు

1 May, 2018 11:55 IST|Sakshi

కొనసాగుతున్న గుప్తనిధుల అన్వేషణ

తుగ్గలి:  చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణ కొనసాగుతోంది. రెండున్నర నెలలుగా కోటలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. కోట పైభాగాన పలు ప్రాంతాలతో పాటు, కోట బురుజులను సైతం వదల్లేదు. సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమైన కొద్ది రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో చుట్టూ రాతి బండలతో కట్టిన తొట్టిలాంటిది బయట పడింది.సోమవారం కోట పైభాగంతో పాటు, దిగువున ఉన్న పెద్ద గుండు కింద సైతం తవ్వకాల పనులు చేపట్టారు. స్వామీజీలు, మాంత్రికులు, అధికారులు ఇలా ఎవరుపడితే వారు చెప్పిన చోటల్లా తవ్వకాల చేస్తుండడంతో జనం విస్తుపోతున్నారు. తవ్వకాలకు నెల్లూరు వచ్చిన 12 మంది కూలీలు ఉదయం సాయంత్రం పనులు చేస్తున్నారు. తవ్వకాలను ఆదోని ఆర్డీఓ ఓబులేసు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సుబ్బారెడ్డి, తుగ్గలి ఎస్‌ఐ పులిశేఖర్, ఆర్‌ఐ మధుసధనరావు, వీఆర్‌ఓ కాశీరంగస్వామి పాల్గొన్నారు. ఏది ఏమైనా మరో వారం రోజుల పాటు తవ్వకాలు చేపట్టి ముగింపు పలకనున్నట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు