తిరిగి వెళ్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి

7 Sep, 2013 20:54 IST|Sakshi

'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో పాల్గొని తిరిగి వెళ్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగులు సభలో పాల్గొని తిరిగి వెళ్తుండగా హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్ సమీపంలో సన్రైజ్ ఆస్పత్రి సమీపంలో బస్సుపై కొంతమంది యువకులు రాళ్లతో దాడి చేశారు. కొంత దూరం నుంచి తమ బస్సు వెనకాలే బైకుపై వస్తున్న ముగ్గురు యువకులు దాదాపు మూడు కిలోల రాయి తీసుకుని డ్రైవర్ వెనకాలే ఉన్న అద్దాన్ని పగలగొట్టారని ట్రెజరీ శాఖలో పనిచేస్తున్న వంశీ అనే ఉద్యోగి తెలిపారు.

ఎస్కార్టు వాహనం వెనకాల ఉన్న మొదటి బస్సు తమదేనని, అయినా కూడా బస్సుపై దాడి చేశారని ఆయన చెప్పారు. దీంతో అద్దాలు పగిలి కొంతమందికి కంట్లో అద్దం పెంకులు గుచ్చుకున్నాయి. కమర్షియల్ టాక్స్ ఉద్యోగి కట్టా సత్యనారాయణ (50)కు ముఖం మీద తీవ్ర గాయాలయ్యాయి. ఈ బస్సు వెనక ఉన్న బస్సులను పటిష్ఠ బందోబస్తుతో తీసుకెళ్లారు. క్షతగాత్రులకు హయత్నగర్లోని సన్రైజ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు