రిజిస్ట్రేషన్లకు విరామం

30 May, 2014 03:32 IST|Sakshi
రిజిస్ట్రేషన్లకు విరామం

- నేటినుంచి మూడు రోజులపాటు సర్వర్ నిలిపివేత
- జూన్ 2 తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
- రాష్ట్రాలకు వేర్వేరు సర్వర్లు

నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్ : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సేవలకు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు విరామం లభించనుంది. ఈ కారణంగా జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయూల్లో ఆస్తుల క్రయవిక్రయూలకు సంబంధించిన లావాదేవీలు పూర్తిగా నిలిచిపోనున్నారుు. ఆస్తుల క్రయ, విక్రయూలు, బహుమతులు వంటి రిజిస్ట్రేషన్లతోపాటు ఈసీ, పీసీల జారీకి బ్రేక్ పడనుంది. మీ సేవా కేంద్రాల ద్వారా జారీ అయ్యే ఎంకంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), పబ్లిక్ నకలు (పీసీ) ధ్రువీకరణ పత్రాల జారీ కూడా నిలిచిపోనుంది. ‘అపాయింటెడ్ డే’ రోజుగా పేర్కొంటున్న జూన్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ సర్వర్లను వేరు చేయనున్నారు.

ఈ దృష్ట్యా మే 30, 31 తేదీల్లో రిజిస్ట్రేషన్లు జరగవు. జూన్ 1 ఆదివారం సెలవు. జూన్ 2న ఆన్‌లైన్ సర్వర్ సేవలు అందుబాటులోకి వస్తేనే రిజిస్ట్రేషన్లు తిరిగి మొదలవుతారు.  ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఒకే సెంట్రల్ సర్వర్ ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ లావాదేవీలు నిర్వహించింది. జిల్లాలోని 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయూల ద్వారా రోజుకు సగటున 300 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నారు.

తద్వారా నిత్యం ఆ శాఖకు రూ.1.50 కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది. వరుసగా మూడు రోజులపాటు రిజిస్ట్రేషన్లు జరగవనే సమాచారంతో అత్యవసరంగా లావాదే వీలు జరపాలనుకునే వారు గురువారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయూల వద్ద క్యూ కట్టారు. విద్యుత్ కోతలు, సర్వర్లు మొరారుుంచడంతో లావాదేవీలు మందకొడిగా సాగారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా