కొబ్బరితోటలో వింత

3 Jul, 2017 12:20 IST|Sakshi


రణస్థలం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం డేరశాం గ్రామంలో వింత సంఘటన వెలుగుచూసింది. గ్రామంలోని ఓ కొబ్బరితోటలో వింత పుట్టగొడుగు స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కోబ్బరి తోటలో మనిషి చేయిన పోలిన పుట్టుగొడుగు గుర్తించిన రైతు ఎవరో గుర్తుతెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని తన తోటలో పాతిపెట్టారని హడలిపోయాడు.
 
అనంతరం విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఇది పుట్టగొడుగు అని స్పష్టం చేశారు. వింత పుట్టగొడుగు విషయం ధావానంలా పాకడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇది చూడటానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు