పిచ్చికుక్కల దాడి: బాలుడు మృతి

16 Jun, 2018 16:57 IST|Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బాలాజీ నగర్ చెరువు సెంటర్‌లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి ఆరేళ్ల బాలుడుపై దాడి చేశాయి. ఇంటి వద్ద ఆడుకుంటున్న నాగేంద్రపై కుక్కలు గుంపు దాడి చేసింది.  దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. నాగేంద్ర స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు.

అయితే కుక్కలు ఒక్కసారిగా మీద పడడంతో భయపడిన నాగేంద్ర కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో బాలాజీ నగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. కుక్కల దాడిపై స్థానికలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతన్నాయని ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు