‘అంగన్‌వాడీ’ల అందోళన

20 Feb, 2014 04:21 IST|Sakshi
‘అంగన్‌వాడీ’ల అందోళన

‘అంగన్‌వాడీ’ల అందోళన
 
 ూడూరు టౌన్ ‘అంగన్‌వాడీ’లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా కార్యదర్శి ఎన్ స్వరూపారాణి డిమాండ్ చేశారు.
  స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని బుధవారం గూడూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు,హెల్పర్లు ముట్టడించి ఆందోళనకు దిగారు. అనంతరం ర్యాలీగా వెళ్లి టవర్‌క్లాక్ కూడలిలో మానవహారంగా నిలిచారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగుల పని గంటలను పెంచి వేతనాలను మాత్రం పెంచకుండా వారి శ్రమను కొల్లగొడుతుందన్నారు.
  కార్యకర్తల విధులతో పాటు అదనంగా బీఎల్‌ఓ డ్యూటీలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఐసీడీఎస్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం వెంటనే మానుకోవాలన్నారు. అలాగే అమృతహస్తం, బాలబడులు, పెంచిన సెంటర్ అద్దెలు వెంటనే చెల్లించాలన్నారు. ప్రతి సెంటర్‌కు గ్యాస్ సిలిండర్, నాసిరకం కొడిగుడ్లు కాకుండా మేలురకం గుడ్లు పంపిణీ చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు.
 వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ నాయకులు కటికాల వెంకటేశ్వర్లు, రమణయ్య తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకురాళ్లు హెప్సిబా, జ్యోతి, నాగమణి, సుశీల పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు