తీరంలో అలజడి

5 Aug, 2019 11:32 IST|Sakshi
తీరం అలజడిగా ఉండడంతో బోటుతో ఒడ్డుకు చేరుకుంటున్న మత్స్యకారులు  

సాక్షి, విజయనగరం : వాతావరణ మార్పులతో సంద్రంలో అలజడి నెలకొంది. అలలు ఉవ్వెత్తున ఎగసి తీరాన్ని తాకుతున్నాయి. చింతపల్లి తీరం ఆదివారం కోతకు గురికావడంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. సముద్రంలో బలమైన గాలులు వీయడం.. కెరటాల తాకిడి పెరగడంతో వేటకు వెళ్లేందుకు వెనుకడుగువేస్తున్నారు. పూసపాటిరేగ తీరంలో సుమారు 400 వరకు బోట్లు ఉన్నా కేవలం 12 బోట్లతోనే వేట సాగించారు. చింతపల్లి రేవు నుంచి కేవలం 3 బోట్లు మాత్రమే వేటకు వెళ్లాయి. పతివాడబర్రిపేట, తిప్పలవలస, తమ్మయ్యపాలెం, కోనాడ, చింతపల్లి గ్రామాల మత్స్యకారులు వేటను వాయిదా వేసుకున్నారు.                             

>
మరిన్ని వార్తలు