అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి

15 Oct, 2014 04:29 IST|Sakshi

తిరుపతిక్రైం: విద్యార్థిని అనుమానాస్ప ద స్థితిలో మృతి చెందిన సంఘటన తుమ్మలగుంట సమీపంలోని ఓ ప్రైవే టు కళాశాలలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎంఆర్‌పల్లె సీఐ మద్దయాచారి, ఎస్‌ఐ ఆదినారాయణ, బాధితుల కథనం మేరకు... కోడూరుకు చెం దిన మల్లిఖార్జునరెడ్డి, భారతిల కుమార్తె రేఖ (16) తుమ్మలగుంట సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్స రం చదువుతోంది.

అంతకు ముందు ఆమె వేరొక కళాశాలలో చదువుతుండేది. అయితే ఆ కళాశాల రేఖకు నచ్చకపోవడంతో మూడు నెలల క్రితం తుమ్మలగుంటలోని కళాశాలలో ఆమె తల్లిదండ్రులు చేర్చించారు. ఇక్కడ చేర్చినప్పటికీ తాను హాస్టల్‌లో ఉండనంటూ తల్లిదండ్రులకు తెలిపేది. ఈ నేపథ్యం లో, సోమవారం కళాశాలకు వెళ్లి మల్లిఖార్జునరెడ్డి తన కుమార్తెను కలిశారు. అప్పుడు కూడా రేఖ తాను ఇక్కడ ఉండనంటూ తండ్రితో గొడవ పడింది.

తం డ్రి వెళ్లిపోవడంతో పెదనాన్నకు ఫోన్ చేసి తనను తీసుకెళ్లమంటూ ప్రాధేయపడింది. మనస్తాపానికి గురైన రేఖ ఇదేరోజు రాత్రి  స్టడీ అవర్స్‌కు వెళ్లకుండా, రూమ్‌లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసుల కథనం. పోస్టుమార్టం నిమిత్తం రేఖ మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రుల కథనం మరోలా ఉంది. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నట్టు చెప్పారు. ఉరి తాలూకు గాయాలు మెడపై లేవని పేర్కొన్నారు.  న్యాయం చేయాలని కోరుతూ రుయా ఆస్పత్రి మంగళవారం ధర్నా చేశారు. వారిని కోడూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు పరామర్శిం చారు. రేఖ మృతిపై అనుమానాల నేపథ్యంలో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిం చాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు