ఉద్యోగాల భర్తీ కోసం వినూత్న నిరసన

16 Dec, 2015 17:16 IST|Sakshi
హైదరాబాద్: వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయం ఎదుట బుధవారం మధ్యాహ్నం నిరుద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ మాటే మర్చిపోయిందని విమర్శించారు.
 
ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పేపర్ ప్లేట్లతో చేసిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. బాబు వచ్చే జాబు రాకపాయే.., గబ్బర్ సింగ్ మిస్సింగ్ అంటూ ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన తెలియజేశారు.
 
మరిన్ని వార్తలు