చదువుకావాలంటే... ఇలా వెళ్లాలి మరి!

17 Jul, 2018 12:17 IST|Sakshi
చదువుకావాలంటే... ఇలా వెళ్లాలి మరి!

కురుపాం విజయనగరం :   ఇక్కడ నీటిలో వెళ్తున్న వీరంతా చదువుకోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి. కురుపాం మండలం గొటివాడ పంచాయతీ బోరి గిరిజన గ్రామానికి చెందిన 15మంది వరకు గిరిజన చిన్నారులు ప్రాధమిక విద్యనభ్యసించేందుకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న గొటివాడ మండల పరిషత్‌ పాఠశాలకు కాలినడకన వెళుతుంటారు.

మామూలు రోజుల్లోనైతే ఫర్వాలేదు గానీ... వర్షాకాలం వస్తే మాత్రం ఇదిగో ఇలా దారిలోని వట్టిగెడ్డ వాగు దాటాలి. సోమవారం వారు పాఠశాలకు వెళ్తుండగా వట్టిగెడ్డలోకి నీరు చేరడంతో ఇలా ఒకరి చేయి ఒకరు పట్టుకొని గెడ్డను దాటే ప్రయత్నం చేస్తున్నారు.

పొరపాటున జరగరానిదేమైనా జరిగితే ఆ కన్నవారి కడుపుకోత తీర్చేదెవరు? నష్టం జరిగాక పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే అలవాటున్న సర్కారుకు ఇక్కడ ఓ కాజ్‌వే నిర్మించాలన్న ఆలోచన రాకపోవడమే దురదృష్టకరం.                        

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్వారంటైన్‌ పూర్తైనవారిని తరలించండి

కరోనా నుంచి రబీ గట్టెక్కినట్టే..

‘రాజకీయాలకు సమయం కాదన్న కనీస స్పృహ లేకుండా..’

లాక్‌డౌన్‌లోనూ మద్యం అమ్మకాలా..

విస్తరిస్తున్న కరోనా!

సినిమా

కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌

దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్‌

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు