పరీక్ష పెడుతున్న నిబంధనలు!

14 Mar, 2014 01:43 IST|Sakshi
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మరింత పారదర్శకత, నాణ్యమైన నిర్వహణ కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నూతన నిబంధనలు విద్యార్థులకు శాపంగా మారాయి. పరీక్షా పత్రాల పంపిణీకి తక్కువ సమయం కేటాయించడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రశ్నపత్రాలు పంపిణీ చేయవలసిన సమయం తగ్గించడం వల్ల ఇటు విద్యార్థులు, అటు నిర్వాహకులు తీవ్ర ఒత్తిడికి  గురవుతున్నారు.
 
  పరీక్ష ప్రారంభానికి కేవలం 30 నిమిషాల ముందు మాత్రమే ప్రశ్నపత్రాల బండిళ్లను పోలీసుస్టేషన్ నుంచి తీసుకు వెళ్లవలసి ఉంది. 
  పశ్నపత్రాలను విద్యార్థికి ఇచ్చిన రెండు నిమిషాల ముందు మాత్రమే బండిళ్ల సీల్‌ను ఓపెన్  చేయాలి.
  అయితే ఈ నిబంధనలను అమలు చేసేం దుకు సమయం ఏమాత్రం సరిపోవడం లేద ని నిర్వాహక సిబ్బంది వాపోతున్నారు. 
  సమీప పోలీసుస్టేషన్ నుంచి తీసుకురావడానికి కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుందని చెబుతున్నారు.
  ముందుగా తీసుకొచ్చినా ఉదయం 9  గంటలకు రెండు నిమిషాల ముందు మాత్రమే విద్యార్థులకు ప్రశ్నపత్రాలు పంపిణీ చేయాల్సి ఉంది. 
 
  అయితే పత్రాల సీల్ ఓపెన్ చేసి పరీక్షా కేంద్రంలోని రెండు నిమిషాల్లో అన్ని గదుల విద్యార్థులకు పంపిణీ చేయడం సాధ్యమయ్యే పనికాదని అంటున్నారు. చివర ఉన్న గదుల్లో పంపిణీ చేసేసరికి 5 నుంచి 10 నిమిషాల సమయం దాటిపోతుంది. దీంతో విద్యార్థులకు చివర్లో సమయం చాలడం లేదు.
  పరీక్ష చివరిలో అదనంగా సమయాన్ని ఇచ్చే అధికా రం స్థానిక అధికారులు ఉన్నా... సమయాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ముగిసిన సంస్కృతం, హిందీ పరీక్షలకు గదిలో అందరూ ఒకేసబ్జెక్ట్‌కు చెందిన వారు పరీక్ష రాశారు. దీంతో సమస్య అంతజటిలం కాలేదు. అయితే రానున్న రోజుల్లో 4 గ్రూప్ సబ్జెక్టులకు చెందిన ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల పేపర్లు ప్రతి గదిలోనూ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కుదించిన సమ యం విద్యార్థులకు శాపంగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.  సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.  
 
 రెండో రోజు 92 శాతం హాజరు
 జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండో రోజు గురువా రం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 69 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సర సంస్కృతం, తెలుగు పరీక్షలు జరిగాయి. ద్వితీయ సం వత్సరానికి చెందిన 22,135 మంది విద్యార్థులలో  92 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో సాధార ణ కోర్సుల ఇంటర్ విద్యార్థులు 17,997 (95.3 శాతం) మంది హాజరయ్యారు. అదేవిధంగా వృత్తి విద్యాకోర్సు ఇంటర్ విద్యార్థులు 2,893 మంది విద్యార్థులు మాత్ర మే హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆర్‌ఐఓ ఎల్‌ఆర్ బాబాజీ ‘న్యూస్‌లైన్’కి తెలిపారు.
 
>
మరిన్ని వార్తలు