పరిమళించిన మానవత్వం

21 Jan, 2019 07:36 IST|Sakshi
షణ్ముఖరావుకు ఆర్థిక సాయం అందిస్తున్న దృశ్యం

అనారోగ్యంలో ఉన్న ట్యూషన్‌ మాస్టార్‌కు పూర్వ విద్యార్థుల సాయం

శ్రీకాకుళం, కవిటి: మండలంలోని కొత్త వరక గ్రామానికి చెందిన ట్యూషన్‌ మాస్టార్‌ శిలగాపు షణ్ముఖరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన పూర్వ విద్యార్థులు తమవంతుగా ఆర్థిక సాయం ఆదివారం అందించారు. మాస్టార్‌ను ఆయన నివాసంలో కలిసిన మాజీ సర్పంచ్‌ బెందాళం శ్రీరాంప్రసాద్, బొరివంక ఎంపీటీసీ సభ్యుడు బి.విజయకృష్ణ, బాలక సీతారామ్మూర్తి.. విద్యార్థులు తరఫున రూ.25,000 లను వితరణగా అందజేశారు. ఆయన త్వరగా కోలుకో వాలని ఆకాంక్షించారని తెలిపారు. బొరివంక ఉన్నత పాఠశాల, పావనీ విద్యాలయంలో చదువుకున్న ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిన షణ్ముఖరావు అనారో గ్యం పాలైన విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వాట్సప్‌ గ్రూప్‌లో సందేశం షేర్‌ చేసుకుని వెంటనే స్పందించి ఆయనకు తమవంతుగా సాయం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పూర్వ విద్యార్థులను అభినందించారు.

మరిన్ని వార్తలు