వైద్య సీట్లు భర్తీ చేయకపోతే కౌన్సెలింగ్ నిలిపివేయాలి

30 Sep, 2014 11:09 IST|Sakshi

విజయవాడ: సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి వైద్య సీట్లు అన్ని భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎదుటవారు ఆందోళన చేపట్టారు. మొత్తం సీట్లు భర్తీ చేయకపోతే కౌన్సెలింగ్ నిలిపివేయాలన్నారు. సీట్లు భర్తీ చేయని వైద్య కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి సూచించారు. కాలేజీ యాజమాన్యాలు చేసిన తప్పులకు విద్యార్థులు బలి అవ్వాలా అంటూ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు