ఎస్‌ఐ తీరుపై ఏయూ విద్యార్థుల ఆందోళన

19 Nov, 2018 08:55 IST|Sakshi
పరిపాలనా భవనం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులకు నచ్చజెబుతున్న పోలీసులు

ఏయూక్యాంపస్‌(విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విద్యార్థిపై ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు అందోళనకు దిగారు. ఆదివారం మధ్యాహ్నం వర్సిటీ పరిపాలనా భవనం వద్ద నిరసన చేపట్టారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎంవీపీ కాలనీ ప్రాంతంలో టిఫిన్‌ చేయడానికి వెళ్లిన న్యాయ కళాశాల విద్యార్థి సురేష్‌పై ఎస్‌ఐ అనుచితంగా చేయిచేసుకున్నారన్నారు.

దాడిలో విద్యార్థికి చెవిపై గాయం కావడంంతో ఆగ్రహించిన విద్యార్థులు శనివారం రాత్రి 3 గంటల సమయంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ నివాసాన్ని ముట్టడించారు. రిజిస్ట్రార్‌కు జరిగిన విషయాన్ని వివరించిన విద్యార్థులు  ఆదివారం ఉదయం మరో పర్యాయం ర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకుని పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు. తూర్పు ఏసీపీ నరసింహమూర్తి ఇతర పోలీసు అధికారులు అక్కడకు చేరుకుని విద్యార్థులకు సర్దిచెప్పారు. పోలీసులు విద్యార్థులకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. విద్యార్థికి అవసరమైన చికిత్సను చేయించడానికి పోలీసులు ముందుకు వచ్చారు. దీనితో శాంతించి విద్యార్థులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

>
మరిన్ని వార్తలు