ప్రజలలో అవగాహన బాగా పెరిగింది : డాక్టర్‌ సమరం

1 Dec, 2019 11:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రైల్వే స్టేషన్‌ వద్ద ఆదివారం జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ ర్యాలీ ప్రారంభించారు. సమాజ భాగస్వామ్యం ఎయిడ్స్‌ వ్యాధి నివారణ పేరుతో వందలాది మంది విద్యార్థులతో తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ఈ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో 23 వేల మంది ఎయిడ్స్‌ రోగులున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. వీరంతా 4ఏ ఆర్టీ సెంటర్స్‌ ద్వారా చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్‌ సమరం మాట్లాడుతూ.. 2030 నాటికి ఎయిడ్స్‌ పూర్తిస్థాయిలో తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎయిడ్స్‌ తగ్గుముఖం పట్టడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు బావున్నాయనీ, వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన బాగా పెరిగిందని వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు