ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల అవస్థలు

10 Mar, 2018 11:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలేజ్‌ హాస్టల్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క కరెంటు లేక, మరోపక్క తాగడానికి నీళ్లు లేక అష్టకష్టాలు పడుతున్నారు.

సమస్యలపై అధికారులకు తెలియజేసినా ఫలితం లేదని విద్యార్థులు తెలిపారు. దీంతో వారు నిరసనకు దిగారు. కాగా, అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు