ఓయూలో పోలీసులపై విద్యార్థుల రాళ్లదాడి

16 Dec, 2013 13:13 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థి సంఘాల రాజ్భవన్ ముట్టడి సోమవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. హైదరాబాద్లో గవర్నర్ పాలనను అంగీకరించేది లేదంటూ వారు తమ నిరసనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఓయూ విద్యార్థుల ఛలో  రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎన్సీసీ గేట్ వద్ద విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ...రాళ్లతో దాడి చేయటంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

రాజ్ భవన్ ముట్టడిని విద్యార్థులు అసెంబ్లీ ముట్టడిగా మార్చారు. భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లాలనుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై విద్యార్థులు రాళ్లతో దాడి చేయగా, పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు