అబ్బుర పరచిన భారీ భోగిదండ 

12 Jan, 2020 11:05 IST|Sakshi
భారీ భోగిదండ

తాళ్లరేవు (ముమ్మిడివరం): చొల్లంగిపేట శ్రీవివేకానంద ఇంగ్లిషు మీడియం హైసూ్కల్‌ విద్యార్థులు తయారు చేసిన భారీ భోగిదండ అందరినీ అబ్బురపరచింది. నెల రోజులుగా విద్యార్థులు ఆవుపేడను సేకరించి, ఎంతో శ్రమించి ఈ దండను తయారు చేసినట్లు ప్రిన్సిపాల్‌ ఎంబీ శంకర్‌ తెలిపారు. సుమారు లక్షా పది వేలకు పైగా పిడకలతో, సుమారు 1100 మీటర్లు పొడవుతో ఈ భోగిదండ ఉన్నట్లు తెలిపారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా శనివారం ఈ దండను విద్యార్థులు గ్రామంలో ప్రదర్శించారు. ఈ దండను 300 మందికిపైగా విద్యార్థులు గ్రామంలో ప్రదర్శించి అనంతరం భోగిమంటలో వేశారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన పెద్ద పండుగ విశిష్టతను నేటి తరం వారికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈ భారీ భోగిదండను తయారు చేసినట్లు స్కూల్‌ చైర్మన్‌ కందెళ్ల గంగబాబు తెలిపారు.

  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా