ఎస్వీయూ వీసీ పదవిపై కుదరని ఏకాభిప్రాయం

13 Sep, 2015 04:24 IST|Sakshi

యూనవర్సిటీక్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా ఈ కమిటీ సమావేశం అర్ధంతరంగా ముగిసింది. వీసీ నియామక ప్రక్రియ కోసం ఏర్పాటైన సెర్చ్ కమిటీ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో సమావేశమైంది. సభ్యులు గోవర్ధన్‌మెహతా, సీవీ రాఘవులు, సునీతదావ్రాలు రాత్రి 6.30 గంటల వరకు వీసీ పదవికి ఎవరిని సిఫారసు చేయాలన్న అంశంపై చర్చిం చారు. అందిన విశ్వసనీయ సమాచారం మేరకు  సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో సమావేశాన్ని  వాయిదా వేసినట్టు తెలిసింది. ఈ కమిటీలో సభ్యులు ముంబైలోని ఓ పరిశోధనా సంస్థకు చెందిన ఓ ప్రొఫెసర్ ను ప్రతిపాదించగా మిగిలిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

 సత్యనారాయణకే అవకాశం ?
 మాజీ రిజిస్ట్రార్ ఈ.సత్యనారాయణకే ఎస్వీయూ వీసీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. డెప్యూటీ సీఎం కృష్ణమూర్తితో సన్నిహిత సంబంధాలు కలిగిన సత్యనారాయణ ఎస్వీయూలో సీడీసీ డీన్, రిజిస్ట్రార్‌గా పని చేశారు. దీంతో ఈయనను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చినట్టు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈయన పేరును ఖరారు చేయాలన్న ప్రతిపాదన వచ్చినట్టు  తెలుస్తోంది. అలాగే ఎస్వీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కిరణ్ క్రాంత్ చౌదరి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దయానంద్, ఎస్కేయూ వీసీ రాజగోపాల్, ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్లు దేవసేననాయుడు, జయసింహలు నాయుడు, పీ.గోవిందురాజులు పేర్లు కూడా పరిశీలనకు వ చ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
 
 

>
మరిన్ని వార్తలు