ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసిన ఎస్సై

23 Jun, 2020 07:39 IST|Sakshi

అమలాపురం పోలీసుల్లో ఆందోళన

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: మెరైన్‌ ఎస్సై, ప్రస్తుతం అమలాపురం డివిజన్‌లో కరోనా విధుల్లో ఉన్న డి.ప్రశాంత్‌కుమార్‌ సోమవారం మధ్యాహ్నం ఓ అరగంట సేపు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయడం పట్టణంలో చర్చనీయాంశమైంది. అలాగే పోలీసుల్లో ఆందోళన అలుముకుంది. చివరకు ఫోన్‌ ఎత్తిన ఎస్సై కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు మాట్లాడారు. తక్షణమే అమలాపురం పోలీసు అధికారులు స్పందించి అమలాపురంలోని ఎస్సై ఇంటికి వెళ్లి ఆయనను సముదాయించారు.

అనంతరం కొందరు ఎస్సై సన్నిహితులు ఆయనను పట్టణ పీఎస్‌కు తీసుకువచ్చారు. డీఎస్పీ, సీఐలు ఎస్సై ప్రశాంత్‌కుమార్‌కు కౌన్సెలింగ్‌ చేశారు. తన కొత్త పోస్టింగ్‌ ప్రయత్నాలను కొందరు అడ్డుకుంటుండంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఎస్సై ప్రశాంతకుమార్‌ ఆత్యహత్య చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా పోలీసు అధికారులకు సమాచారం అందడంతో వారు స్పందించి ఆయనను పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకుని వచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీనిపై డీఎస్పీ బాషా ఎస్సై ప్రశాంతకుమార్‌కు ధైర్యం చెప్పి అలాంటి ఆలోచనలు వద్దని సర్దుబాటు ధోరణిలో సముదాయించారు.


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు