ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌గా సుబ్రమణ్యం శ్రీరామ్‌

4 Jun, 2019 16:22 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నూతన అడ్వొకేట్‌​ జనరల్‌గా సుబ్రమణ్యం శ్రీరామ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. న్యాయవ్యవస్థలో అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) పోస్టుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.  ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు, వివిధ కార్పొరేషన్లకు స్టాండింగ్‌ కౌన్సిళ్లుగా వ్యవహరిస్తున్న న్యాయవాదులు తమ తమ పోస్టులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరి స్థానంలో కొత్త అడ్వొకేట్‌ జనరల్‌ అవసరాన్ని బట్టి ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులను నియమించుకుంటారు. ఈ నియామకాల విషయంలో అడ్వొకేట్‌ జనరల్‌కు జగన్‌మోహన్‌ రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిసింది. ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ఏజీకి జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్ధేశం చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు