కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూప్రకంపనలు

26 Jan, 2020 07:03 IST|Sakshi

గుంటూరు : కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున 2:37 నిముషాలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కాగా రిక్టర్‌ స్కేలుపై 4.7గా నమోదైనట్లు తెలిసింది. పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాలతో పాటు నందిగామ, బెల్లంకొండ, వెంకటాయపాలెం, క్రోసూరు, పిడుగురాళ్ల, మాచవరం, తుళ్లూరు, తాడికొండ తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పెద్ద శబ్దంతో మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో ఆందోళనకు గురయ్యారు.

అలాగే తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ, ఖమ్మం ,సూర్యాపేట జిల్లాల్లోనూ పలు సెకన్ల పాటు భూమి కంపించింది. సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. చిలుకూరు , మునగాల ,అనంతగిరి , నడిగూడెం ,కోదాడ, మండలాల్లో తెల్లవారుజామున 2 గంటల  37 నిముషాలకు దాదాపు 45 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. అర్ధరాత్రి పక్షులు,మూగ జీవాలు ముందే గుర్తించి ఆర్తనాదాలు చేశాయి. ఇళ్లలో గాజు వస్తువులు కింద పడి పగిలిపోయాయి. భయంతో జనం బయటకు పరుగులు తీశారు.

మరిన్ని వార్తలు