పోలీస్‌ వలయంలో సిర్రాజుపల్లి..

10 Dec, 2018 11:05 IST|Sakshi

గ్రామంలోకి వెళ్లకుండా సుధీర్‌రెడ్డిని అడ్డగించిన పోలీసులు

మంత్రి కార్యక్రమం ముగిసే వరకు నిడుజివ్విలో హౌస్‌అరెస్టు 

ఎర్రగుంట్ల : మండల పరిధిలోని సిర్రాజుపల్లి గ్రామంలో అదివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చట్టాలను గౌరవించాల్సిన పోలీసు యంత్రాంగం  వైఎస్సార్‌ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి, వైఎస్సార్‌  సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎం హర్షవర్థన్‌రెడ్డిలను హౌస్‌ అరెస్టు చేశారు. ఇప్పటి వరకు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులుగా చెలామణి అవుతున్న  రంగసాయిపు గ్రామంలోని ఒకరిద్దరు  మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గంలో చేరాలని నిర్ణయించారు. గ్రామంలో ఆదివారం విందు  ఏర్పాటు చేసి మంత్రిని ఆహ్వనించారు.పక్కనే సిర్రాజుపల్లి గ్రామ ఉంది. ఇది మాజీ మంత్రి డాక్టరు  మైసురారెడ్డి స్వగ్రామం. వైఎస్సార్‌ సీపీ నాయకులు డాక్టరు సుధీర్‌రెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి నిడుజివ్వి గ్రామం నుంచి వారి స్వగ్రామమైన సిర్రాజుపల్లికి వెళ్లేందుకు బయలుదేరారు. అప్పటికే గ్రామం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి  వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మా స్వగ్రామానికి వెళ్లేందకు అభ్యంతరం ఏమిటని డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం హర్షవర్థన్‌రెడ్డి  పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.ఎట్టకేలకు పోలీసు వలయాన్ని ఛేదించుకొని సుధీర్‌రెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి సిర్రాజుపల్లి గ్రామానికి వెళ్లారు. అనంతరం పోలీసులు వారి వద్దకు వెళ్లి మంత్రి ఆదినారాయణరెడ్డి ఇదే గ్రామానికి వస్తున్నారని, అందువల్ల మీరు  గ్రామాన్ని వదిలి వెళ్లాలని పట్టుపట్టారు.సుధీర్‌రెడ్డి, హర్షవర్థన్‌రెడ్డిలను  నిడుజివ్వి గ్రామానికి తీసుకెళ్లి అక్కడే హౌస్‌ అరెస్టు చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి రంగసాయిపురం గ్రామం నుంచి వెళ్లిన తర్వాత వైఎస్సార్‌ సీపీ నేతలను విడిచిపెట్టారు. 

మరిన్ని వార్తలు