చెరుకు బకాయిలు రూ. 200 కోట్లు!

9 Sep, 2014 02:43 IST|Sakshi
చెరుకు బకాయిలు రూ. 200 కోట్లు!

సీజన్ ముంచుకొస్తుండడంతో అన్నదాత ఆందోళన
పట్టించుకోని సర్కార్

 
బొబ్బిలి:  అన్నదాతకు అన్నివిధాల అన్యాయమే జరుగుతోంది. ప్రకృతి ఒకవైపు పగపడుతుంటే...మరోవైపు పండించిన పంటకు రావలసిన సొమ్ములు చేతికిరాక నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా చెరుకు పంటకు సంబంధించి రాష్ట్రంలో రైతులకు అందాల్సిన బకారుులు రూ.200 కోట్లు వరకు ఉన్నాయంటే పరిస్థితి అర్థం అవుతుంది. రాష్ట్రంలో 42 చక్కెర కర్మాగారాలు ఉండగా 29 ఫ్యాక్టరీలు రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపాన లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం రైతులకు బకారుుల చెల్లించని నేపథ్యంలో ఫ్యాక్టరీ డెరైక్టర్లు జైలు పాలు కావడంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్‌సీఎస్ గ్రూపునకు నెల్లూరు వద్ద కూడా మరో ఫ్యాక్టరీ ఉండగా... అక్కడా కోట్ల రూపాయల్లో బకారుు పడడంతో అక్కడి రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సహకార రంగంలో నాలుగు చక్కెర కర్మాగారాలున్నారుు. వాటి పరిధిలో సుమారు రూ.40 కోట్ల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో మూడు మిల్లులు ఉండగా రెండింటిని ప్రైవేటు యూజమాన్యం నిర్వహిస్తుండగా, ఒకటి సహకార రంగంలో నడుస్తోంది. ఆ జిల్లాలో కూడా రూ.26 కోట్లు వరకు బిల్లులు రైతులకు చెల్లించాల్సి ఉంది. విశాఖ జిల్లాలో నాలుగు సహకార రంగానికి చెందిన మిల్లులు ఉండగా రూ.20 కోట్ల వరకు బకారుులున్నారుు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నాలుగు కర్మాగారాలు ఉండగా ఆమదాలవలస కర్మాగారర  ఎప్పుడో మూతపడింది.

భీమసింగి మిల్లు సహకార రంగంలో, సంకిలి, లచ్చయ్యపేట కర్మాగారాలు ప్రైవేటు యూజమాన్యాల చేతిలో ఉన్నారుు. చెరుకు పంటకు ఎకరాకు సుమారు రూ.40 వేల వరకు మదుపులైతే సరాసరి 25 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. వీటికి కేంద్ర ప్రభుత్వం రూ.2వేలు గిట్టుబాటు ధర కల్పిస్తే, రాష్ట్ర ప్రభుత్వం, మిల్లులు కలిపి మిగిలిన డబ్బులు రైతులకు ఇవ్వాలి. 2002 వరకూ కేంద్రం ప్రకటించిన మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వం సలహా ధరను ఇచ్చేది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం దానిని ఎత్తేయడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయూరై యూజమాన్యం ఆడిందే ఆటగా మారింది. 12 ఏళ్లుగా రాష్ట్రం ధరను ప్రకటించని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సలహా ధర ఇవ్వాలని సుప్రీం కోర్టు సైతం సూచించినా ఇప్పటికీ అమలు కాలేదు. మిగిలిన రాష్ట్రాల్లో ఇది అమలవుతోంది.

ప్రైవేటు ఇష్టారాజ్యం...

గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చక్కెర కర్మాగారాలు నడిచేటప్పుడు వారిచ్చిన సౌకర్యాలు, ప్రోత్సాహకాలు, మద్దతు ధర వల్ల ప్రైవేటు ఫ్యాక్టరీలు దిగి వచ్చేవి. అప్పట్లో 20 ఫ్యాక్టరీలను సహకార రంగం, ప్రభుత్వం కలిపి నడపగా 20 ఫ్యాక్టరీలు ప్రైవేటు యూజమాన్యంలో నడిచేవి. ఇప్పుడు 11 ప్రభుత్వ ఫ్యాక్టరీలు మూతపడగా, కో ఆపరేటివ్ రంగానికి చెందిన ఏడు మాత్రమే మిగిలారుు. వీటిలో తక్కువ సామర్థ్యం కలిగిన పాత యంత్రాలు ఉండడంతో క్రషింగ్ అంతంతమాత్రంగా సాగుతోంది. దీంతో ప్రైవేటు యజమాన్యాల ఇష్టారాజ్యం సాగుతోంది.

రాష్ట్రంలో అత్యంత తక్కువగా లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ కర్మాగారంలోనే  రూ.2350 ధర ఉంది. ఈ మిల్లు పరిధిలో సుమారు 16 వేల మంది రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటించినా చెల్లింపులు లేవు.
 
 

మరిన్ని వార్తలు