చిత్తూరు షుగర్స్‌లో నో క్రషింగ్

18 Jan, 2015 07:23 IST|Sakshi
  • 355 మంది కార్మికుల తొలగింపు
  • ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటన
  • ఆందోళనకు దిగిన కార్మికులు
  • సాక్షి, చిత్తూరు: అదిగో క్రషింగ్.. ఇదిగో క్రషింగ్ అంటూ నెలరోజు లుగా దోబూచులాడిన చిత్తూరు షుగర్స్ పాలకవర్గం, అధికార వర్గం ఎట్టకేలకు చిత్తూరు సహకార చక్కెర కర్మాగారంలో ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించాయి. అంతేకాదు కర్మాగారంలో 30 ఏళ్లకు పైగా  పనిచేస్తున్న  355 మంది సీజనల్ పర్మినెంట్, కన్సాలిడేట్ కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు రెఫరెన్స్ సీసీఎస్ ఈఎస్‌టీటీ ఓఎం 2015 ఉత్తర్వులు జారీచేసింది. రాత్రికి రాత్రే ఈ ఉత్తర్వులు వెలువడ్డా యి.

    బకాయిలు ఇవ్వలేనందునే ఈ ఏడాది కర్మాగారంలో క్రషింగ్ నిలిపివేయడంతోపాటు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో 355 మంది కార్మికులను సైతం విధులనుంచి రిలీవ్ చేస్తున్నట్లు పా లకవర్గం తీర్మానించగా ఇన్‌చార్జ్ ఎండీ అధికారికంగా దానికి ఆమోదముద్ర వేశారు. 12వతేదీనే పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో చూపారు. అధికారులు, చైర్మన్‌తో గొడవ నేపథ్యంలో ఈనెల 10వ తేదీ ఇన్‌చార్జ్ ఎండీ పదవికి రాజీ నామా చేసిన మల్లికార్జున రెడ్డి పేరు మీదనే క్రషింగ్ నిలిపివేత, కార్మికుల తొలగింపు ఉత్తర్వులు వెలువడడం విశేషం.

    అయితే ఇన్‌చార్జి ఎండీ తన పదవికి రాజీనామా చేయకమునుపే ఈ ఉత్వర్వులపై సంత కం చేశారా ? అనే అనుమానం తలెత్తుతోంది. లేకపోతే ఆయన రాజీనామానే ఓ డ్రామానా అనే సంశ యం కూడా కలుగుతోంది. కర్మాగారం కార్యాలయం, ఇం జినీరింగ్ విభాగం, మ్యాన్యుఫ్యాక్చరింగ్ విభాగాలకు చెందిన కార్మికు లు తొలగించిన వారిలో ఉన్నారు. 13 నెల లుగా వారు జీతాలు లేకుండానే పనిచేస్తున్నారు. కార్మికులకు సంబంధించి 12 కోట్ల జీతాలకు చెందిన బకాయిలతోపాటు మరో మూడు కోట్ల పీఎఫ్ బకాయిలు చెల్లించాలి.

    వాటి సంగతి పట్టించుకోని ప్రభుత్వం కార్మికులకు, యూనియన్ నేతలకు  మాట మాత్రమైనా చెప్పకుండా తొలగింపు చర్యలకు దిగడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎండీ పాలక వర్గం తీర్మానానికి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కార్మికులు శనివారం ఉదయం నుంచి కర్మాగారం వద్ద ఆందోళన చేపట్టారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా వందలాది మం ది ఉద్యోగులను ఎలా తొలగిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రైతులు, కార్మికులకు చెందిన బకాయిలను చెల్లించలేని పరిస్థితిలోనే కన్సాలిడేట్ కార్మికులను రిలీవ్ చేసినట్లు చైర్మన్ ఎన్‌పీ రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు.
     
    ఆది నుంచి డ్రామానే

    రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించి  సహకార చక్కెర కర్మాగారాన్ని ముందుకు నడిపిస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత హామీలు తుంగలో తొక్కారు. విలువైన ఆస్తులున్న  కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టేందుకు బాబు ప్రభుత్వం ఆది నుంచే మొగ్గు చూపింది. ఇందుకోసం అధ్యయనం అంటూ కమిటీ వేసి చిత్తూరు షుగర్స్ అమ్మకానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగంతో పాటు అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కర్మాగారం అమ్మకానికి  చంద్రబాబు  తాత్కాలిక విరామం మాత్రమే ఇచ్చినట్లు కనబడుతోంది.

    ఇందులో భాగంగా ఈ ఏడాది రైతులు, కార్మికుల  బకాయిలు చెల్లించడంతో పాటు చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి  ప్రకటించారు. బాబు ప్రకటనతో పాలకవర్గం డిసెంబర్ 4న కర్మాగారంలో స్లోఫైరింగ్ కార్యక్రమం నిర్వహించింది. ఆ తరువాత చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో డిసెంబర్ 11న కర్మాగారంలో పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇదే సమయంలో ప్రభుత్వం పైసా నిధులు ఇవ్వక పోయినా పాలకవర్గం, అధికారవర్గం కర్మాగారం విలువైన స్టోర్స్‌ను తాకట్టు పెట్టి  ఆప్కా బ్ వద్ద రెండు కోట్ల రుణం తెచ్చింది. రుణం కోసం డెరైక్టర్ ఆఫ్ షుగర్స్ సైతం ఆప్కాబ్‌కు సిఫారసు చేసింది. క్రషింగ్ నిర్వహించనపుడు ఆప్కాబ్ నుంచి రుణం ఎందుకు తేవాల్సి వచ్చిందో పాలకవర్గానికే తెలియాలి.

మరిన్ని వార్తలు