పెళ్లికి ముందురోజు ఆత్మహత్య

21 Feb, 2014 02:22 IST|Sakshi
పెళ్లికి ముందురోజు ఆత్మహత్య
  • తమ్మిలేరు రిజర్వాయర్‌లో మృతదేహం
  •  మృతుడు బ్రాంచ్ పోస్టుమాస్టర్
  •  స్వస్థలం చాట్రాయి మండలం పోతనపల్లి
  •  చాట్రాయి, న్యూస్‌లైన్  : పెళ్లి పీటలపై కూర్చోవలసిన  తపాలా శాఖ ఉద్యోగి  బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. గురువారం ఉదయం వెలుగు లో కి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పోతనపల్లి గ్రామానికి చెందిన హసావత్ రామకృష్ణ బీటెక్ చదివాడు. ముసునూరు మండలంలో తంతితపాలాశాఖ బ్రాంచ్ పోస్టుమాస్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. నూజివీడు మం డలం హనుమంతులగూడెం గ్రామానికి చెందిన యువతితో ఇటీవల పెద్దలు పెళ్లి కుదిర్చారు. గురువారం రాత్రి 8.30 గంటలకు ముహూర్తం.

    ఈ నేపథ్యంలో బంధువులంతా పెళ్లి పనుల్లో ఉన్నారు. ఈనెల 18న బంధువులు, స్నేహితులకు శుభలేఖలు ఇచ్చేందుకు వెళ్లాడు. ఆ క్రమం లో ఆ రోజు రాత్రి తనకు కాబోయే మామగారి ఇంటికి వెళ్లి, మరుసటిరోజు ఉదయం పోతనపల్లి తిరిగి వచ్చాడు. కొద్దిసేపటికే తల్లికి చెప్పి బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు.  పలుచోట్ల ఆరా తీసినా అతడి జాడ తెలియలేదు. దీంతో  తల్లి చిన్నమ్మ అనుమానంతో చాట్రాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రామకృష్ణ మేనమామ గురువారం ఉదయం చింతలపూడి నుంచి పోతనపల్లి వస్తుండగా తమ్మిలేరు రిజ ర్వాయర్ గేట్ల వద్ద మేనల్లుడి మోటార్‌సైకిల్ కని పించింది. చుట్టుపక్కల వెదికినా అతడు కనిపిం చలేదు. పోతనపల్లి వచ్చి సోదరికి ఈ విషయం చెప్పా డు. బంధువులతో కలిసి తమ్మిలేరులో వెదగ్గా, రామకృష్ణ మృతదేహం కనిపించింది.
     
    మనస్తాపంతోనే ఆత్మహత్య?
     
    రామకృష్ణకు ఒక వ్యక్తి ఫోన్ చేసి ‘మేమిద్దరం ప్రేమించుకున్నాం.. నీవు ఎలా పెళ్లి చేసుకుం టా వు’ అని బెదిరించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కాబోయే భార్య ఇంటికి వెళ్లినపుడు వారు ఒత్తిడి తెచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెం ది బుధవారం తమ్మిలేరులో దూకి  ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు న మోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కో సం తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
     
    నన్నెవరు ఆదుకుంటారు

     రామకృష్ణ మరణంతో తల్లి చిన్నమ్మ కన్నీరుమున్నీరవుతోంది.  భర్త చనిపోయాడని, ఒక్కగానొ క్క కుమారుడు కూడా మరణించడంతో నన్నెవరు ఆదుకుంటారు.. విలపిస్తుండటం చూపరుల కంట తడి పెట్టించింది. ఈ ఘటనతో గిరి జన తండాలో విషాదం నెలకొంది. రామకృష్ణ అంత్యక్రియలకు పోస్టల్ అధికారులు రూ.7 వేలు సాయం అందజేశారు.
     
    వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
     రామకృష్ణ కుటుంబీకులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి, ఆ పార్టీ నియోజకవర్గ నేత లాకా వెంగళరావు యాదవ్, గ్రామ సర్పంచ్ బసవ య్య, మాజీ సర్పంచ్ కారంగుల వాసు తదితరులు పరామర్శించారు. రామకృష్ణ మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
     

మరిన్ని వార్తలు