ఇస్కాన్ ఆధ్వర్యంలో వేసవి శిబిరం

14 May, 2015 18:44 IST|Sakshi

కవాడిగూడ (హైదరాబాద్) : ఇస్కాన్ కూకట్‌పల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గీతా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు డెరైక్టర్ మహా శృంగదాస గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిదిరోజులపాటు 8 నుండి 20 ఏళ్ల వయసు వారి కోసం భగవద్గీతపై వేసవి శిక్షణ శిబిరం ఉంటుందన్నారు. శిబిరం ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు కొనసాగుతుందన్నారు.

పిల్లలకు వ్యక్తిత్వ వికాసంతో పాటు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, తోబుట్టువులతో ఎలా ప్రవర్తించాలి, విద్యా విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సంస్కృత శ్లోక పఠనం, వైధిక కథలు, డ్రామాలు, డ్యాన్స్, ఆటలు, భగవద్గీత యధాతథం తదితర విషయాలను అత్యంత సరళంగా నేర్పిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 8008924201, 9866340588 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు