ఎండలో తిరగకుండా జాగ్రత్త పడండి

27 May, 2019 16:15 IST|Sakshi

సాక్షి, అమరావతి : భానుడి భగభగలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లాడిపోతోంది. మధ్యాహ్నం వేళలో 44డిగ్రీల చేరుతున్న ఉష్ణోగ్రతలు ఇబ్బందిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కొన్ని సూచనలు చేసింది. ప్రజలు ఎక్కువగా ఎండల్లో తిరుగకుండా ఉండాలని సూచించింది. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. చిత్తూరు జిల్లాలో అత్యధిక ఉష్టోగ్రతలు నమోదయ్యాయని, జిల్లాలోని విజయపురంలో 46.02, నగరిలో 46, వరదయ్యపాలెంలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. గుంటూరు జిల్లా ముప్పాళ్లలో 45, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 45. 49, ప్రకాశంలో 44. 67, నెల్లూరులో 44.10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాని తెలిపింది.

మరిన్ని వార్తలు