ఉష్ణం..ఉగ్రరూపం

16 Apr, 2018 09:30 IST|Sakshi

పెరుగుతున్న ఫంగల్‌ ఇన్‌ ఫెక్షన్స్‌

సన్‌ బర్న్స్‌ తో జాగ్రత్త అంటున్న నిపుణులు

వేసవిలో పిల్లల సంరక్షణపై సూచనలు

సూర్యుడి చూపులు కాకపుట్టిస్తున్నాయి. చెమటలు చికాకు తెప్పిస్తున్నాయి. వేడిగాలులు వెక్కిరిస్తున్నాయి. గొంతు తడారిపోతోంది. శరీరంలోని శక్తి మొత్తం పోతోంది. వేసవి సమీపించిన తరుణంలోబయటకు వెళ్లిన వారి పరిస్థితి ఇది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. ఈ దశలో రకరకాల చర్మ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా గాలిసోకని టైట్‌ దుస్తుల వల్ల ఫంగల్‌ ఇన్‌ ఫెక్షన్‌ లు, ఎండలో ప్రయాణాలు చేయడం వలన సన్‌ బర్న్స్, రాష్‌ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
– తగరపువలస (భీమిలి)

సన్‌  బర్స్న్‌(చర్మం కాలిపోవటం)
ఎండలో ఎక్కువగా తిరగే వారు సన్‌ బర్న్స్‌కు గురవుతుంటారు. చర్మం అంతాకాలినట్లు అయిపోయి, మచ్చలు ఏర్పడతాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటోంది. ఈ సమస్యతలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు. అదేవిధంగా అధికంగా నీరు, పానీయాలుతీసుకోవాలి.

రాష్‌ (చెమట కాయలు)
వేసవిలో అధికంగా చెమట పట్టిన వారికి ఎక్కువగా రాష్‌ వస్తుంది.అదే విధంగా గాలి సోకని మందమైన దుస్తులు, సిల్క్‌ దుస్తులు ధరించడం వల్ల సమస్య తలెత్తుతోంది. ఎండలో బయటకు వెళ్లే సమయంలో సన్‌ స్కిన్‌ లోష వాడటం మంచింది.

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌
బిగుతుగా వుండే వస్త్రాలు ధరించేవారికి, స్నానం చేసిన తర్వాత చర్మాన్ని సరిగ్గాతుడుచుకోకుండా వస్త్రాలు ధరించే వారికి ఫంగల్‌ ఇన్‌ ఫెక్షన్స్‌ వస్తుంటాయి. తొడలమధ్య తామర సోకడం, దురద ఎక్కువగావస్తుంది. దీని బాధితులు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడంతో పాటు, అనంతరంతేమ లేకుండా చర్మాన్ని శుభ్రంగా తుడుచుకుని, సంబంధిత కొలనైన్‌ లోషన్స్‌ రాయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

చికున్‌  ఫాక్స్‌ (అమ్మవారు)
వేసవిలో వైరల్‌ ఇన్‌ ఫెక్షన్‌ తో చికున్‌  ఫాక్స్‌ ఎక్కువగా వస్తాయి. మనందీనిని అమ్మవారు పూసింది అంటాం. చికున్‌ ఫాక్స్‌ వచ్చినట్లు గుర్తించిన వెంటనే సకాలంలో మందులు వాడటం ద్వారా దాని ప్రభావం చర్మంపై పడకుండా జాగ్రత్త పడవచ్చు. మూఢ నమ్మకాలకు పోకుండా సకాలంలో మందులు వాడితే చర్మంపై ప్రభావం తగ్గుతుంది. వైద్యుని సలహా మేరకు నడుచుకోవాలి.

సన్‌ ఎలర్జీ..
ఎండలో ఎక్కువగా తిరిగే వారికి సన్‌  ఎలర్జీ సోకుతుంది. దీంతోచర్మంపై దద్దుర్లు రావడం, దురదలు పుట్టడం, రాత్రి సమయాల్లో నిద్రకూడ సరిగా పట్టకుండా ఇబ్బంది పెడుతోంది.

ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు

  •   
          వేసవిలో శరీరానికి నూనె వంటి పదార్థాలు, సన్‌ స్క్రీన్‌ లోషన్స్‌ను రాసుకోవాలి

  •      ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు, తలకు టోపీ ఉండాలి.

  •      ముఖ్యంగా లూజు దుస్తులు, అవి కూడా కాటన్‌  దుస్తులను వాడాలి.

  •      సీజనల్‌ ఫ్రూట్స్‌తో తీసుకోవడంతో పాటు, నీరు ఎక్కువగా తాగాలి.

  •      ఫంగల్‌ ఇన్‌ ఫెక్షన్స్‌ సోకిన వారు వాడేటవల్స్‌ మరొకరు వాడితే వారికి సోకే అవకాశం వుంది.
  •      వాటిని వేడి నీటిలో నానబెట్టి వాష్‌చేస్తే మంచిది.
మరిన్ని వార్తలు