తాడిమర్రి @ 40

22 Feb, 2019 12:17 IST|Sakshi
అనంతపురంలో ఎండ వేడిమి నుంచి రక్షణకు ఓ వాహన చోదకుడు వినియోగిస్తున్న సరికొత్త గొడుగు

ఫిబ్రవరిలోనే మండుతున్న ఎండలు

అనంతపురం అగ్రికల్చర్‌: చలికాలం పూర్తి కాకుండానే భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కనిపించాల్సిన పరిస్థితి ఫిబ్రవరిలోనే కనిపిస్తోంది. వేసవి రాక మునుపే పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా నమోదువుతున్నాయి. తాడిమర్రిలో గురువారం అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 34 నుంచి 38 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అగళిలో 14.8 డిగ్రీల కనిష్టం ఉండగా.. మిగతా మండలాల్లో 16 నుంచి 22 డిగ్రీల మధ్య కొనసాగింది. గాలిలో తేమశాతం ఉదయం 72 నుంచి 78, మధ్యాహ్నం 22 నుంచి 34 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది వేసవితాపం తారస్థాయిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు