‘సన్‌’డశాసనుడు

10 May, 2019 12:31 IST|Sakshi
ఎండ వేడిమి తట్టుకోలేక ముఖానికి చున్నీ రక్షణగా...

దశాబ్దకాలంలో అత్యధికమిదే 

అల్లాడిపోయిన ప్రజలు

వడగాడ్పులూ తీవ్రం

పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో భానుడి విశ్వరూపం చూపిస్తున్నాడు. ప్రచండశాసనుడై నిప్పులు చెరుగుతున్నాడు. ప్రజలపై కక్ష కట్టినట్టు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతూ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఫొనీ తుపాను ప్రభావంతో నాలుగు రోజుల క్రితం జిల్లాలో మబ్బులు కమ్ముకుని కొద్దిగా ఎండ వేడిమి తగ్గి కాస్త ఉపశమనం కలిగినా తుపాను తీరం దాటిన తరువాత భానుడు తిరిగి ప్రజలపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. గురువారం తాడేపల్లిగూడెంలో నమోదైన 47 డిగ్రీల ఉష్ణోగ్రతే గత దశాబ్దకాలంలో జిల్లాలో అత్యధికమని వాతావరణ శాఖ చెబుతోంది.  జిల్లాలోని ఇతర పట్టణాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు నగరంలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

.ఏలూరు నగరంతోపాటు నరసాపురం, భీమవరం, పాలకొల్లు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తణుకు, తదితర ప్రాం తాల్లో గురువారం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  వేసవిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప ఇళ్ళలోనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. రాబోయే రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్టీజీఎస్‌ ప్రకటించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే రెండు రోజుల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండబోతోందని, పిడుగులు పడబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చంటి పిల్లలు, వృద్ధులు ఉంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ నెల 12 నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత కాస్త తగ్గుతుందని ఆర్టీజీఎస్‌ ప్రకటించడంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకే ‘అమ్మ ఒడి’ : సీఎం జగన్‌

టీడీపీకి మరో షాక్‌!

చంద్రబాబు తీరుతోనే ఆ రహదారి పనుల్లో జాప్యం

ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ: సీఎం జగన్‌

ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం : వైఎస్‌ జగన్‌

మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్‌ జగన్‌

‘ప్రజావేదిక’పై సీఎం జగన్‌ సంచలన నిర్ణయం

గుండె చెరువు

నిలువ నీడ లేక..

సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి

సేవ చేయడం అదృష్టం

సీఎం వైఎస్‌ జగన్‌ నిబద్ధతతో పనిచేస్తున్నారు

డైవర్షన్‌!

ఉలిక్కిపడిన చిత్తూరు 

నవశకానికి దిశానిర్దేశం 

వెలిగొండతోనే ప్రకాశం    

సొమ్ము ఒకరిది.. పేరు పరిటాలది

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ ఎంపీటీసీ దాడి

ఘరానా మోసగాళ్లు అరెస్టు..

విడిదిలో వింతలు!

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

టీడీపీ నేతల భూదాహం.. రైతులకు శాపం

మూడు ముళ్లు.. మూడు తేదీలు

ప్చ్‌.. మర్చిపోయా !

పదోన్నతి కల్పించాల్సి ఉన్నా..

జగనన్న పాలన సజవుగా సాగాలంటూ.. ఎమ్మెల్యే పాదయాత్ర

ఆధిపత్య పోరు.. ఆలయం కూల్చివేత

వర్షం కురిసే..పొలం పిలిచే..

గోవిందా..హుండీ సొమ్ము మాదంటే మాది!

గ్రామ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భాయీజాన్‌ ఫిట్‌నెస్‌కు ఫిదా కావాల్సిందే!

బెంబేలెత్తిపోయిన తమన్నా

మీకు నా ఐడీ కావాలా : హీరోయిన్‌

ఆకట్టుకుంటోన్న ‘బుర్రకథ’ ట్రైలర్‌

బ్రేకింగ్‌ న్యూస్‌ ఏంటి?

ప్రజలతోనూ మమేకం అవుతాం