వేసవికి ప్రత్యేక రైళ్లు

6 Mar, 2019 07:31 IST|Sakshi

విశాఖపట్నం, తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రాంతాలకు పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు సీనియర్‌ డీసీఎం జి.సునీల్‌కుమార్‌ తెలిపారు.∙కాచిగూడ–టాటానగర్‌(07438)(వయా దువ్వాడ) స్పెషల్‌ రైలు కాచిగూడలో ప్రతి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంటకు దువ్వాడ చేరుకుని అక్కడి నుంచి 1.02 గంటలకు బయలుదేరి 2.45 గంటలకు విజయనగరం చేరుకుని.. అక్కడి నుంచి 2.47 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 7.45 గంటలకు టాటా నగర్‌ చేరుకుంటుంది. ఈ రైలు జూన్‌ 24వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో(07439)టాటానగర్‌లో ప్రతి మంగళవారం రాత్రి 10.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.45 గంటకు విజయనగరం, 3.15గంటలకు దువ్వాడ చేరుకుని అక్కడి నుంచి 3.17 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు జూన్‌ 25వ తేదీ వరకు నడుస్తుంది. ఈ రైలు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ పరిధిలో రానుపోను దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బెరంపూర్, ఖుర్దారోడ్, నరాజ్‌ మర్తాపూర్, సుకిందా రోడ్, కేండూఝార్‌ఘఢ్, జరోలి స్టేషన్లలో ఆగుతుంది. 1–సెకండ్‌ ఏసీ, 2–థర్డ్‌ ఏసీ, 7–స్లీపర్‌ క్లాస్, 6–జనరల్‌ సెకండ్‌ క్లాస్, 2–సెకండ్‌ క్లాస్‌ లగేజీ కం బ్రేక్‌ వ్యాన్‌ కోచ్‌లతో ఈ స్పెషల్‌ రైలు నడుస్తుంది.

కాచిగూడ–విశాఖపట్నం(వయా గుంటూరు) వీక్లీ స్పెషల్‌ రైలు కాచిగూడలో ప్రతి మంగళవారం సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ వీక్లీ స్పెషల్‌ రైలు జూన్‌ 25వ తేదీ వరకు నడుస్తుంది. ఈ రైలు మల్కజ్‌గిరి, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు 2–ఏసీ టూ టైర్, 4–ఏసీ త్రీటైర్, 10–స్లీపర్‌క్లాస్, 2–చైర్‌కార్, 2–సెకండ్‌ క్లాస్‌ కం లగేజీ కోచ్‌లతో నడుస్తుంది.

విశాఖపట్నం–తిరుపతి(07479) వీక్లీ స్పెషల్‌ రైలు ప్రతి బుధవారం రాత్రి 7.05 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జూన్‌ 26వ తేదీ వరకు నడుస్తుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడురు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు 2–ఏసీ టూ టైర్, 4–ఏసీ త్రీటైర్, 10–స్లీపర్‌క్లాస్, 2–చైర్‌కార్, 2–సెకండ్‌ క్లాస్‌ కం లగేజీ కోచ్‌లతో నడుస్తుంది.

మరిన్ని వార్తలు