9, 10 తేదీల్లో కిరణ స్పర్శ

4 Mar, 2020 11:10 IST|Sakshi
అరసవల్లి ఆదిత్యుని గర్భాలయంలో కిరణాల తాకిడి (ఫైల్‌)

వాతావరణం అనుకూలిస్తే అద్భుతమే

అరసవల్లి: అరసవల్లి ఆదిత్యుని దేవస్థానంలో కనిపించే అరుదైన దృశ్యానికి సమయం దగ్గరపడింది. ఈ నెల 9, 10 తేదీల్లో ఆదిత్యుని మూలవిరాట్టును తొలి సూర్యకిరణాలు స్పృశించే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. సూర్యోదయ సమయాన సాక్షాత్కరించనున్న ఈ కిరణ స్పర్శ దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు అరసవల్లి క్షేత్రానికి రానున్నారు. ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా ఆలయ గర్భాలయంలో కొలువైన ప్రత్యక్ష దైవమైన శ్రీసూర్యనారాయణ స్వామి పాదాలపై నేరు గా తొలిసూర్యకిరణాలు తాకనున్నాయి.

రానున్న సోమ, మంగళ వారాల్లో కన్పించనున్న ఈ అద్భుత దర్శనానికి ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకా‹Ù, ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మలు సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. దీనిపై ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ‘సాక్షి’ తో మాట్లాడుతూ వాతావరణం అనుకూలిస్తే కిర ణ దర్శన ప్రాప్తి ఉంటుందన్నారు. ఈ నెల 9,10 తేదీల్లోనే బాగా కిరణాలు పడే అవకాశముందని అన్నారు.

మరిన్ని వార్తలు