సుంకేసుల నుంచి నిలిచిన నీటి విడుదల

21 Jun, 2016 03:37 IST|Sakshi
సుంకేసుల నుంచి నిలిచిన నీటి విడుదల

నంద్యాలకు తప్పని తాగునీటి కష్టాలు

 నంద్యాల: సుంకేసుల రిజర్వాయర్ నుంచి నంద్యాలకు నీటి విడుదల నిలిచిపోయింది. గత వేసవిలో పట్టణంలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నా అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నెల  9వ తేదీన సుంకేసుల డ్యాం వద్ద 500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఈ నీటితో పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు గట్టెక్కుతాయని చైర్‌పర్సన్ దేశం సులోచన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు.  నీటిని విడుదల చేసిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపారు.

అయితే 9వ తేదీ విడుదల చేసిన నీరు 13వ తేదీ సాయంత్రం నంద్యాలకు చేరింది. ఈ నీటిలో చిన్న చెరువును సగం నింపారు. పాత, కొత్త ఎస్‌ఎస్ ట్యాంకులను నింపడానికి అధికారులు ఏర్పాటు చేస్తుండగా.. సుంకేసుల నుంచి నీటి సరఫరాను నిలిపి వేశారు. సుంకేసులకు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో నీటి విడుదలను నిలిపి వేశారని డీఈ షాకీర్ హుసేన్ తెలిపారు. ప్రస్తుత ం నంద్యాలలోని పాత, కొత్త ఎస్‌ఎస్ ట్యాంకుల్లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్‌కి చేరింది. వీటికి నీరు చేరకుంటే నంద్యాల ప్రజలు దాహం తో అల్లాడాల్సిందే. విభేదాల కారణంగా స్థానిక టీడీపీ నేతలు ప్ర‘జల’ కష్టాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు