సమైక్య శంఖారావానికి వరుణుడి మద్దతు!

26 Oct, 2013 12:40 IST|Sakshi
సమైక్య శంఖారావానికి వరుణుడి మద్దతు!

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావానికి వరుణుడు కూడా మద్దతు పలికాడు. గత రెండు రోజులుగా నగరాన్ని తడిపిముద్ద చేసిన వరుణుడు సమైక్య శంఖారావం సభ సందర్భంగా నేడు విరామం ప్రకటించాడు. దీంతో ఈరోజు ఉదయం నుంచి వర్షం ఆగిపోవడంతో వాతావరణం పొడిగా మారింది. ప్రతికూల వాతావరణం తొలగిపోవడంతో సమైక్య వాదుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

గత రెండు రోజులుగా ఎండపొడ లేకుండా గడిపిన భాగ్యనగరానికి నేడు ఊరట లభించింది. ఎడతెరిపిన లేకుండా వర్షాలతో ఉక్కిరిబిక్కిరయిన నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అటు వర్షం తెరిపివ్వడంతో సమైక్య శంఖారావం సభకు సమైక్యవాదులు పోటెత్తుతున్నారు. విభజనకు వ్యతిరేకంగా తమ గళం వినిపించేందుకు ఎల్బీ స్టేడియం వైపు కదులుతున్నారు. సమైక్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వార్తలు