ఎండ.. ద డ

22 May, 2015 04:04 IST|Sakshi
ఎండ.. ద డ

అనంతపురం అగ్రికల్చర్ : మూడు రోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించడంతో ‘అనంత’లో మండే ఎండలు దంచేస్తున్నాయి. వేసవితాపం తారాస్థాయికి చేరుకోవడంతో ఉక్కపోతతో ప్రజలు అలమటిస్తున్నారు. ఉదయం 10 గంటలకే సన్‌స్ట్రోక్ మొదలవుతుండటంతో బయటకు రావడానికి జనం బెంబేలెత్తుతున్నారు. వృద్ధులు, పిల్లలు, కష్టజీవుల పరిస్థితి దారుణంగా తయారైంది. మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నీరు, నీడ కోసం జనం ఎగబడుతున్నారు.

మొత్తమ్మీద వేసవికాలం ముగింపునకు వచ్చేసరికి ఎండతీవ్రత జనానికి ముచ్చెటమలు పట్టిస్తున్నాయి. గురువారం శింగనమల మండలం తరిమెలలో గరిష్టంగా 43.3 డిగ్రీలుగా నమోదైంది. గార్లదిన్నె, యల్లనూరు 42.8 డిగ్రీలు, గుంతకల్లు 42.3 డిగ్రీలు, పెద్దవడుగూరు, యాడికి 42.1 డిగ్రీలు, రాప్తాడు 41.9 డిగ్రీలు, తనకల్లు 41.8 డిగ్రీలు, విడపనకల్ 41.7 డిగ్రీలు, తాడిమర్రి 41.4  డిగ్రీలు, పామిడి 41.3 డిగ్రీలు, కూడేరు 41.3 డిగ్రీలు, పుట్లూరు 41.2 డిగ్రీలు, అనంతపురం 41.1 డిగ్రీలు, ఆత్మకూరు 40.9 డిగ్రీలు, పెద్దపప్పూరు, బెళుగుప్ప 40.8 డిగ్రీలు, కదిరి 40.4 డిగ్రీలు, వజ్రకరూరు 40.3 డిగ్రీలు, బత్తలపల్లి 40.2 డిగ్రీలు మేర నమోదయ్యాయి.

మిగతా మండలాల్లో గరిష్టంగా 38 నుంచి 40 డిగ్రీలు, కనిష్టంగా 26 నుంచి 28 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే గాలిలో తేమశాతం ఉదయం పూట 65 నుంచి 75 ఉండగా మధ్యాహ్న సమయానికి 25 నుంచి 35 శాతానికి పడిపోయింది. నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతుండటంతో జనం హడలిపోతున్నారు.

>
మరిన్ని వార్తలు