సూరయ్య హత్య కేసులో శీనప్పే మొదటి ముద్దాయి

19 Nov, 2014 02:42 IST|Sakshi
సూరయ్య హత్య కేసులో శీనప్పే మొదటి ముద్దాయి

అనంతపురం అర్బన్: ఉరవకొండ మండలం వై.రాంపురంలో 2009 ఆగస్టులో జరిగిన బోయ సూరయ్య హత్య కేసులో పయ్యావుల శీనప్పే(శ్రీనివాసులు) మొదటి ముద్దాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మంగళవారం అనంతపురంలో పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎం.శంకర్‌నారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి విలేఖర్లతో మాట్లాడారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయాన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకొని అమాయకులను హింసిస్తున్నారని ఆరోపించారు. ఈశ్వరయ్య అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే తన ఇంటిపై కాంగ్రెస్ జెండా కట్టాడని అప్పటి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఆయన తమ్ముడు శీనప్పలు సూరయ్యను అతి దారుణంగా హత్య చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకిత్తించిందన్నారు.

హత్య కేసుతో శీనప్పకు సంబంధం ఉందని సీఐడీ తేల్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. 2013లోనే శీనప్పను పోలీసులు అరెస్టు చేయడానికి సిద్ధపడితే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాపాడారన్నారు. ఈ కేసును నీరుగార్చడానికి కేశవ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. అలాగే వ్యసనాలకు బానిసైన వై.రాంపురం గ్రామానికి చెందిన బోయి వెంకటరమణ(ముని) జీడిపల్లి రిజర్వాయర్‌లో శవమై తేలాడని, కానీ బోయ సూరయ్య భార్య ఓబుళమ్మ, తల్లి శాంతమ్మే మునిని హతమార్చారని పోలీసులు కొత్త కథకు తెరలేపారని అన్నారు.

ఈ నెల 15న హత్యకు గురైన సూరయ్య ఇంటికి పోలీసులు వెళ్లి ముని హత్యతో సంబంధం ఉందని బెదిరించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించడంతో వారు ఎమ్మెల్యే విశ్వను ఆశ్రయించారని, మగదిక్కులేని వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ కుటుంబాన్ని కేశవ్ ప్రలోభాలకు గురిచేస్తున్నారని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని, న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. టీడీపీ నేతల అరాచకాలను అరికట్టాలని పోలీసులను కోరారు.

సూరయ్య హత్య కేసులో శీనప్పకు సంబంధం ఉందని గతంలోనే సీబీసీఐడీ తేల్చిచెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సూరయ్య హత్య కేసులో తిరిగి విచారణ జరిపించకుండా శీనప్పను ముద్దాయిగా పరిగణించి శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హత్యారాజకీయాలు పెరిగాయని, చంద్రబాబు ఓ నియంతగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముని మృతికి సూరయ్య కుటుంబ సభ్యులు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ రాజశేఖర్‌బాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

పోలీసులు కూడా ఈ విషయాన్ని గమనించి సూరయ్య తల్లి, భార్యకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కో-ఆర్డినేటర్ ఎగ్గుల శ్రీనివాస్, జిల్లా  బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పెన్నోబులేసు, వెన్నపూస రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 ఓబుళవ్ము కుటుంబానికి హాని జరిగితే పయ్యూవుల సోదరులదే బాధ్యత
 ఉరవకొండ: వై.రాంపురం గ్రావూనికి చెందిన వైఎస్సార్‌సీపీ వుహిళా కన్వీనర్ ఓబుళవ్ము కుటుంబానికి ఎలాంటి హని జరిగినా అందుకు పయ్యూవుల సోదరులే(వూజీ ఎమ్మెల్యే కేశవ్, శ్రీనివాసులు) పూర్తి బాధ్యత వహించాలని ఆ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ అన్నారు.

ఎంపీటీసీ సభ్యురాలు చందా చంద్రమ్మతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడుతూ సూరయ్య హత్య కేసులో శ్రీనివాసులు నిందితుడని, ఆయన పేరు చార్జిషీటు నుంచి తొలగించడానికి కేసుతో సంబంధం లేని ఓబుళమ్మ, శాంతమ్మను ప్రలోభాలకు గురిచేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓబుళమ్మకు అండగా ఉంటామని చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా