మావోల కదలికలపై నిఘా

22 Jun, 2019 09:06 IST|Sakshi

సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : మావోల కదలికలపై నిఘా పెట్టినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలియజేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానంగా గతంలో మావోలతో సంబంధాలు ఉన్న గిరిజన గ్రామాల్లో కొత్త వ్యక్తుల చేరికపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. పట్టణాలు, మండల కేంద్రాల్లోని రద్దీగా ఉన్న ప్రాంతాల్లో విజబుల్‌ పోలీస్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఉన్నట్లయితే ప్రజల కదలికలు గుర్తించవచ్చు అన్నారు. అలాగే హైవేలపై వాహనాలు నడిపే వారికి రోడ్డు నిబంధనలు గురించి ఎస్‌ఐ స్థాయిలో కౌన్సిలిం గ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు.

ప్రతీ వాహనానికి వెనుక భాగంగా రేడియం స్టిక్కర్‌ అతికించి ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నదుల నుంచి అక్రమ ఇసుక రవాణ చేస్తే వాహనాలను సీజ్‌ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇసుక అక్రమ నిల్వలు ఉన్నట్లయితే ఇసుక నిల్వ ఉంచిన జిరాయితీ భూమి యజమానిపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమవ్వడంతో కాలేజీల్లో ర్యాంగిగ్‌ జరగకుండా విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం పెండింగ్‌ కేసుల వివరాలను పరిశీలించారు. ఎస్పీతో పాటు సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ ప్రవల్లికలు ఉన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు