సర్వే పనులకు శ్రీకారం

23 Aug, 2013 02:30 IST|Sakshi

దశాబ్దాల కల సాకారమైనట్లే.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గద్వాల -మాచర్ల బ్రాడ్‌గేజ్ కొత్తలైన్, ఉందానగర్ -మహబూబ్‌నగర్ మధ్య డబ్లింగ్ సర్వే పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియను త్వరగా ప్రారంభిస్తే వచ్చే బడ్జెట్‌లో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. రాయిచూర్- మాచర్ల రైల్వేలైన్ పనులకు శ్రీకారం చుడితే వెనకబడిన వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, దేవరకొండ, కల్వకుర్తి ప్రాంతాలకు రైల్వే రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది. విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
 
 గద్వాల, న్యూస్‌లైన్: ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తు న్న గద్వాల -మాచర్ల బ్రాడ్‌గేజ్ కొత్తలైన్, ఉందానగర్ -మహబూబ్‌నగర్ మధ్య డబ్లింగ్ సర్వే పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తయితే కొత్త బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణానికి 2014-15 బడ్జెట్‌లో నిధులు మంజూరయ్యే అవకా శం ఉంది. నిజాం ప్రభుత్వ హయాంలో గద్వాల మీదుగా ప్రస్తుత కర్ణాటకలోని రాయిచూర్ నుంచి గుంటూరు జిల్లాలోని మాచర్ల వరకు కొత్త బ్రాడ్‌గేజ్ లైన్‌ను ఏ ర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. దశాబ్దాల తరువాత మొదటిదశ కింద 2002లో గద్వాల - రాయిచూర్‌ల మధ్య 59 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ లైన్‌కు శంకుస్థాపన చేశారు.
 
 ఇక రెండోదశలో గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపే ట, దేవరకొండ మీదుగా మాచర్ల వరకు కొత్త బ్రాడ్‌గేజ్ లైన్‌ను నిర్మించాలని ప్రతి పాదించారు. ఇందుకోసం గత రైల్వేబడ్జెట్‌లో తుదిసర్వే కోసం అనుమతిచ్చారు. అలాగే మూడేళ్ల క్రితం మంజూరైన ఉందానగర్, మహబూబ్‌నగర్‌ల మధ్య డబ్లింగ్ ట్రాక్ నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో సర్వే కు అనుమతిచ్చారు. ఈ రెండింటి సర్వే పనులు చేపట్టేందుకు రూ.4కోట్ల అంచన్యావయంతో ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అ ప్పగించగా, నెలరోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. గద్వాల - రాయిచూర్‌ల మధ్య కొత్త బ్రాడ్‌గేజ్ లైన్‌కు స ర్వే ప్రారంభ మవడంతో గద్వాల రైల్వేస్టేష న్ నాలుగు వైపుల లైన్లతో కీలక జంక్షన్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది.
 
 గద్వాల సంస్థానాదీశుల కాలంలోనే..
 రాయిచూర్ నుంచి గుంటూరు జిల్లాలోని మాచర్ల వరకు బ్రాడ్‌గేజ్ లైన్ ప్రతిపాదన కు అనుగుణంగా గద్వాల రైల్వేస్టేషన్‌ను జంక్షన్‌గా అభివృద్ధి చేయడంతోపాటు, అవసరమైన మౌలికవసతులు కల్పించేం దుకు గద్వాల సంస్థానాదీశుల కాలంలో నే 105 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. సి కిందారాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఇం త విస్తీర్ణంలో స్థలం ఉన్న రైల్వేస్టేషన్ గద్వా ల కావడం విశేషం. ఇక్కడ రైల్వే శిక్షణ సం స్థలు, మరమ్మతులకు సంబంధించిన మె కానిల్ విభాగం ఏర్పాటు చేయాలని రైల్వేబోర్డు పరిశీలనలో ఉంది. రాయిచూర్- మాచర్ల రైల్వేలైన్‌కు శ్రీకారం చుడితే వెనకబడిన వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చం పేట, దేవరకొండ, కల్వకుర్తి ప్రాంతాలకు రైల్వే రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మొత్తం 244 కి.మీ మేర ఈ లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
 
 రైల్వేట్రాఫిక్ పరిష్కారం కోసం..
 కాచిగూడ-మహబూబ్‌నగర్ మధ్య రైల్వే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు డబ్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని సం బంధిత అధికారులు బోర్డుకు పలుమార్లు నివేదికలు పంపారు. ఈ డబ్లింగ్‌కు అనుమతివ్వాల్సిందిగా మహబూబ్‌నగర్ పా ర్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్‌రావు మూ డేళ్ల క్రితం అప్పటి రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీతో చర్చించి మంజూరు లభించేవిధంగా చేశారు. నాటినుంచి నేటివరకు ఈ డబ్లింగ్ ప్రక్రియ ప్రారం భం కాలేదు. గత రైల్వేబడ్జెట్‌లో కొత్తలైన్ నిర్మాణానికి, డబ్లింగ్ కోసం ప్రతిపాదిం చిన పనుల సర్వేకు అనుమతి లభించిం ది. వీటితో పాటు మహబూబ్‌నగర్ - గు త్తి వరకు డబుల్‌లైన్ ట్రాక్ సర్వేకు అనుమతి లభించినప్పటికీ సర్వే ప్రారంభం కాలేదు. ఈ ప్రక్రియను త్వరగా ప్రారంభిస్తే వచ్చే బడ్జెట్‌లో నిధులు మంజూర య్యే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు