స్నాతకోత్సాహం

23 Jun, 2015 04:05 IST|Sakshi
స్నాతకోత్సాహం

యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ 54వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మూడేళ్ల తర్వాత జరిగిన స్నాతకోత్సవానికి విద్యార్థులు హాజరై, డిగ్రీలు తీసుకున్నారు. 1,297 మంది ప్రత్యక్షంగా, 18,762 మంది పరోక్షంగా పట్టాలు పొందారు. స్నాతకోత్సవంలో 117 మంది పీహెచ్‌డీలు, 12 ఎంపీల్, 18 మంది ఎంటెక్, 14 ఎంబీఏ, 7 ఎంసీఎ, 30 ఎంఈడీ, 4 ఎంఎల్‌ఐసీ, 17 ఎంఫార్మసీ, 6 ఎల్‌ఎల్‌ఎం, 677 ఎమ్మెస్సీ, 302 ఎంఏ, 72 ఎంకాం, 6 ఎంఎఫ్‌ఎం, 15మంది ఎంబీఈ డిగ్రీలు పొందారు.
 
పతకాల పంపిణీ గందరగోళం
ఎస్వీయూ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు పంపిణీ చేసే సమయంలో గందరగోళం ఏర్పడింది. పరీక్షల విభాగం సరైన ఏర్పాట్లు చేయకపోవడం, పలువురు స్నాతకోత్సవానికి హాజరుకాకపోవడం, బంగారుపతకాలు అందుకోవాల్సిన జాబితాను సిబ్బంది సరిగా పెట్టుకోకపోవడంతో ఆటంకాలు తలెత్తాయి. ఒకరి డి గ్రీలు మరొకరికి ఇచ్చేశారు. పలుమార్లు అంతరాయం ఏర్పడి గందరగోళం ఏర్పడింది. దీంతో వైస్‌చాన్సలర్ నేరుగా వెళ్లి సిబ్బందితో మాట్లాడి, సరిగా డిగ్రీలు ప్రదానం చేయాలని సూచించారు. డిగ్రీలు అందించే సమయంలో గవర్నర్ చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎక్కువ సార్లు ఆటంకం ఏర్పడడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో వీసీ రాజేంద్ర, రెక్టార్ జయశంకర్, రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు, డీన్ ఉషారాణి, కేవీ శర్మ, భగవాన్‌రెడ్డి, కార్తికేయన్, కృష్ణయ్య, ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, పీఆర్‌వో రవి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి ,మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి హాజరయ్యారు.
 
పసిడి వీరులు వీరే
ఎస్వీయూ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు పొందినవారి వివరాలిలావున్నాయి. జోహారాభాను (గణితం), సునీతా(గణితం), మీనాకుమారి (బయోకెమిస్ట్రీ), సి.అలే ఖ్య (బోటనీ), కె.స్వాతి, సుధామణి, గీతారాణి, హేమలత, విజయలక్ష్మి (కెమిస్ట్రి), జాహ్నవి(కంప్యూటర్‌సైన్స్), కె.మహేశ్వరి (హోంసైన్స్), సోమశేఖర్( జియాలజీ), ఎం.ప్రియదర్శిని, పవన్‌కుమార్ (ఫిజిక్స్), శ్రీనప్ప(ఆంథ్రోపాలజీ), పి.శ్రీహరిత, ఎవి ప్రసాద్(స్టాటిస్టిక్స్), వెంకటరామయ(జువాలజీ), వీరేష్ (ఎకనామిక్స్), జయపద్మ( ఇంగ్లి షు), పి.రవి(హిస్టరీ), లక్ష్మీప్రసన్న (హిందీ), శ్రీకాంతమ్మ (సోషియాలజీ), రాజేష్(తమిళం), నాగరాజు , బిందు (తెలుగు), ఈశ్వరయ్య (కామర్స్), కె.అనిత (ఎంఎఫ్‌ఎం), ఎం.జయశంకర్ (ఎల్‌ఎల్‌ఎం), కె.రమ్యకృష్ణ, ప్రత్యూష(ఏంబీఏ), వి.సతీష్‌కుమార్ (ఎంఎల్‌ఐసీ), ఫణికుమార్ (ఎంటెక్)లు బంగారు పతకాలు పొందారు.

మరిన్ని వార్తలు