ఇండస్ట్రీలో నాపై కక్షసాధింపులు మొదలయ్యాయి: పృథ్వీరాజ్‌

4 Aug, 2019 16:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్‌ (ఎస్వీబీసీ)లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తామని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎస్వీబీసీ చైర్మన్‌, నటుడు పృథ్వీరాజ్‌ తెలిపారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఆయన ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో రాఘవేందర్‌రావుతోపాటు పలువురు ఎస్వీబీసీ చైర్మన్లుగా ఉన్నారని, వారి హయాంలో ఏమైనా అక్రమాలు జరిగితే.. విచారణ తప్పదని పృథ్వీ స్పష్టం చేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఆయన ప్రకటించారు. ఎస్వీబీసీ కోసం నిబద్ధతతో పనిచేస్తానని, రాఘవేందర్‌రావుతో ఈ విషయంలో తనకు ఎలాంటి పోటీలేదని తెలిపారు. ఎస్వీబీసీ చైర్మన్ అయ్యాక చిత్ర పరిశ్రమలో తనపై కక్షసాధింపులు మొదలయ్యాయని, సినిమాల కోసం తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లు కొంతమంది వెనక్కి తీసుకున్నారని పృథ్వీరాజ్‌ వెల్లడించారు.

ఈ పదవి రావడం పూర్వజన్మ సుకృతం
ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులవ్వడం తన పూర్వజన్మ సుకృతమని పృథ్వీరాజ్‌ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీవారికి ఇలా సేవ చేసుకుంటానని తాను కలలో కూడా అనుకోలేదని పేర్కొన్నారు. జులై 28వ తేదీన ఎస్వీబీసీ చైర్మన్‌గా పదవీ స్వీకారా ప్రమాణం చేశానని తెలిపారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎప్పటికీ రుణ పడి ఉంటానని తెలిపారు. ఎస్వీబీసీ చానల్  ఆధ్యాత్మికతను కాపాడుతానని, చానెల్‌ను దేశంలో నంబర్ వన్ చానల్‌గా చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎస్వీబీసీ చానెల్‌ను నిబద్ధతతో నడిపిస్తానని తెలిపారు. ఈ పదవి తనకు అప్పగించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన పోసాని కృష్ణమురళి తనకు అన్నయ్య లాంటి వారని అన్నారు. పోసాని నిజాయితీ గల వ్యక్తి అని కొనియాడారు.

తిరుమలలో రాజకీయాలు మాట్లాడను!
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని, అమరావతిలోనే రాజకీయాలు మాట్లాడుతానని ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ స్పష్టం చేశారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా రాజకీయలకు అతీతంగా పనిచేస్తానని, భక్తుల మనోభావాలను కాపాడుతానని తెలిపారు. నటుడు శివాజీ చంద్రబాబుకు భజన చేశాడని, ఆయనకు మాట మీద నిలకడ లేదని పేర్కొన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ వైస్సార్‌సీపీ అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్లాస్టిక్‌ నిషేదం; ఫొటో పంపితే రూ.100 పారితోషికం..!

టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది

ఆ విషయంలో జగన్‌కు బీజేపీ సహకరిస్తుంది : విష్ణువర్ధన్‌ రెడ్డి

ఢిల్లీకి చేరుకున్న శ్రీనగర్‌ నిట్‌ తెలుగు విద్యార్థులు..

అందుకే ఆ చానల్స్‌కు నోటీసులు : స్పీకర్‌

‘విదేశీ అతిథి’కి పునర్జన్మ!

బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా..

ముస్లింలకు అండగా వైఎస్సార్‌సీపీ - ఎంపీ విజయసాయిరెడ్డి

నియోజకవర్గానికో అగ్రిల్యాబ్‌

ఉగ్ర గోదావరి

ఊరు దాటి బయటకు వెళ్లగలనా అనుకున్నా

అన్నా.. ఎంత అవినీతి!

నిధులున్నా నిర్లక్ష్యమేల? 

ప్రాణాలు పోతున్నాయి.. ఉద్యోగాలు ఊడుతున్నాయి..

‘అందుకే ప్యాక్‌ చేసిన సన్నబియ్యం’

వాస్తవాలు వెలుగులోకి

జిల్లా సమగ్రాభివృద్ధికి నా వంతు కృషి: హోంమంత్రి

వసతి లోగిళ్లకు కొత్త సొబగులు

సామాన్యుల చెంతకు తుడా సేవలు

మైనర్‌ కాదు.. మోనార్క్‌!

సొల్లు కబుర్లు ఆపండయ్యా..!

చారిత్రాత్మక నిర్ణయాలతో.. రాష్ట్రం ప్రగతి పథంలో..

బ్యాంకులకు వరుస సెలవులు

వలంటీర్ల చేతుల్లోకి నియామక పత్రాలు

రెవెన్యూ అధికారులు కళ్లు తెరిచారు

పండితపుత్రా.. వాస్తవాలు తెలుసుకో!

వాల్తేరు డివిజన్‌ను చేజారనివ్వం

లైంగిక వేధింపులపై సర్కారు సమరం

ఆదరణ నిధులు పక్కదారి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌