సీఎం జగన్‌ను కలిసిన పృధ్వీరాజ్‌

13 Sep, 2019 19:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృధ్వీరాజ్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.  తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాయలంలో ముఖ్యమంత్రిని కలిసి తనను చైర్మన్‌గా నియమించడం పట్ల కృతఙ్ఞతలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  ఎస్వీబీసీ చానల్ ను ప్రారంభించి భక్తులకు అనేక సేవలు అందించే అవకాశం కల్పించారన్నారు. ఇప్పుడు ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఎస్వీబీసీని మరింతగా భక్తులకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని పృధ్వీరాజ్‌ తెలిపారు.

ముఖ్యమంత్రిని కలిసిన పలువురు ప్రముఖులు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌,  కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్‌, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ధనలక్ష్మి, మేరుగ నాగార్జున, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రితో సమావేశమైన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీ తమ నియోజకవర్గ పరిధిలోని అనేక సమస్యలను జగన్‌ దృష్టికి తెచ్చారని సమాచారం. 

మరిన్ని వార్తలు