ఎస్వీయూ రీసెట్ నోటిఫికేషన్ విడుదల

26 Feb, 2015 01:30 IST|Sakshi

తిరుపతి: ఎస్వీయూ రీసెట్-2015(పరిశోధన ప్రవేశ పరీక్ష) నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. వర్సిటీ రీసెర్చ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు, మార్పులు చేసి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి 2 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీసెట్ ధరఖాస్తు ధరను రూ. 1000గా నిర్ణయించారు. తొలిసారిగా వర్సిటీలో ఎంఫిల్‌ను తొలగించి రీసెట్ నోటిఫికేషన్ విడుదలచేశారు.

ఎంఫిల్‌ను తొలగించడంతో పీహెచ్‌డీ సీట్లను భారీగా పెంచారు. గతంలో 1+1 పద్ధతిన పీహెచ్‌డీ సీట్లు భర్తీ చేశారు. ప్రస్తుత నోటిఫికేషన్‌లో మాత్రం ఆ సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్‌లకు గతంలో ఉన్న ఖాళీ సీట్లను దృష్టిలో ఉంచుకుని ఫుల్ టైం సీట్లను (1+2) రెండుకు పెంచింది. అదేవిధంగా పార్ట్ టైం సీట్లను ఖాళీలతో సంబంధం లేకుండా ప్రొఫెసర్‌కు-2, అసోసియేట్ ప్రొఫెసర్‌కు-1, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు-1 లెక్కన సీట్లను భర్తీ చేస్తారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు