చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్నస్వామి స‍్వరుపానంద

3 Jul, 2019 13:13 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : స్వామి స‍్వరుపానంద చాతుర్మాస్య దీక్ష కోసం పవిత్ర పుణ్యక్షేత్రం రిషికేష్‌కు వెళ్లనున్నారు. అక్కడ 2 నెలల 20 రోజులపాటు దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్బంగా ఆయన బుధవారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు.  అనంతరం ఆయన స్వామి స్వరూపానంద మాట్లాడుతూ..  దీక్ష నిమిత్తం రిషికేశ్ బయల్దేరి వెళుతున్నట్లు చెప్పారు. కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రిలలో 15 రోజులపాటు తపస్సు చేస్తారు. అనంతరం రిషికేష్‌లో శారదా పీఠానికి చేరుకొని ఈ నెల 16 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు చాతుర్మాస్య దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకాలంలో భక్తులెవరు తన వద్దకు రావద్దని, సెప్టెంబర్‌ 20 తర్వాతే భక్తులకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. అంతేకాక పుష్కరాల పేరుతో గత ప్రభుత్వం సీజీఎఫ్‌ ఫండ్‌ను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. దీనిపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి భక్తులకు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాగా ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి కేదార్, గంగోత్రి, యమునోత్రి లో 15 రోజుల పాటు తపస్సు అనంతరం రిషికేశ్ లోని శారదా పీఠానికి చేరుకుంటారు.

మరిన్ని వార్తలు