అప్పన్న సన్నిధిలో స్వరూపానందేంద్ర సరస్వతి

10 Dec, 2019 13:12 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని మంగళవారం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. సింహాద్రి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వెంకటేశ్వరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అప్పన స్వామి 32 బీజ మంత్రాలు పురస్కరించుకుని 32 రోజుల అప్పన్న దీక్షను స్వరూపానందేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యద్భుతమై దేవాలయం అప్పన్నస్వామి ఆలయమని తెలిపారు. సింహాద్రి అప్పన్న గిరిజనులకు, చెంచు కులాల వారికి ఆరాధ్య దైవంగా త్రేతా యుగం నుంచి పూజలు అందుకున్నారని పేర్కొన్నారు. నారాసింహ క్షేత్రాల్లో అత్యధికంగా ఇష్టపడే దేవాలయం సింహాద్రి అప్పన ఆలయం అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు